వినాయకా రావయ్యా - మా పూజలందు కోవయ్యా ---వి.నర్సింహా చారి, ఉపాధ్యాయులు,జడ్పీ హెచ్ యస్. శేరిలింగంపల్లి.

వినాయకా రావయ్యా - మా పూజలందు కోవయ్యా ---వి.నర్సింహా చారి, ఉపాధ్యాయులు,జడ్పీ హెచ్ యస్. శేరిలింగంపల్లి.

🌿🌹🌼వినాయకా రావయ్యా - మా పూజలందు కోవయ్యా🌼🌿
రచన:వి.నర్సింహా చారి, ఉపాధ్యాయులు,జడ్పీ హెచ్ యస్. శేరిలింగంపల్లి.
@@@@@@@@@@@@@

భాద్రపదా మాస మొచ్చె
చవితి పండుగ కొని తెచ్చె
ఊరు వాడ ఎటుచూసిన
మన గణపతి కాన వచ్చె!!

ఆది శక్తి అంశవా
పార్వతమ్మ బిడ్డవా
కైలాస పతికి నీవు
ఇష్ట మైన కొడుకువా!!

మాయింటికి వత్తువా
మా కోర్కెల తీర్తువా
విఘ్నరాజ గణపతివై
విజయ,అభయ మిత్తువా!!

ఏక దంత నిను వేడెద
లంబోదర నిను కొల్చెద
సర్వ కార్య ఫలమందగ
ఆది పూజ్య నిను మ్రొక్కెద!!

గజవదనా శరణంటిని
వక్ర తుండ నినుగంటిని
భక్తుల నివు బ్రోతువనే
నీ కథలను నేవింటిని!!

ఉండ్రాళ్ళను అర్పించెద
నీ భజనను నేచేసెద
బిల్వ పత్రదళములతో
భక్తి మీర పూజించెద!!

భూలోకము నందునేడు
భీతిల్లిరి జనముచూడు
కరోన విష కోరల్లో
చిక్కుకున్న ప్రజలచూడు!!

అడుగంటెను మా ఆశలు
అణగారెను మా బ్రతుకులు
కరుణించగ యిలకుచేరి
చూపించుము నీ మహిమలు!!

జయము నీకుగణపయ్యా
మీ బంటును నేనయ్యా
వేడుచుంటి మనమందున
నీ దర్శన మీయయ్యా!!

......✍️మణికర్ణిక🌹☘️
వి.నర్సింహా చారి
సెల్ నం:8500296119 

0/Post a Comment/Comments