సామాజిక అసమానతలు, రుగ్మతలు, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యాలపై ఉమ్మడి పోరాటమే అత్యాచారాలను నివారిస్తుంది. -- వడ్డేపల్లి మల్లేశము

సామాజిక అసమానతలు, రుగ్మతలు, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యాలపై ఉమ్మడి పోరాటమే అత్యాచారాలను నివారిస్తుంది. -- వడ్డేపల్లి మల్లేశము

సామాజిక అసమానతలు, రుగ్మతలు, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యాలపై ఉమ్మడి పోరాటమే అత్యాచారాలను నివారిస్తుంది.

-- వడ్డేపల్లి మల్లేశము9014206412

         భారత దేశము అనేక అసమానతలు అంతరాలు వివక్షతతో కూడిన ఆ సమ సమాజం. పేదరికము, నిరుద్యోగ౦, ఆకలిచావులు, ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సర్వసాధారణమై పోతున్న నేటి పరిస్థితులలో ఈ దుస్థితికి కారణాలను అన్వేషించి పరిష్కారాలను చూపినటువంటి ప్రభుత్వాలు తక్కువే. ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రలోభ పెట్టడానికి ,వారిని ఉద్ధరించడానికి తమ ప్రభుత్వాలు  ఉన్నట్లు గా ప్రకటించుకుo టారు రాజకీయ నాయకులు. కానీ నిరంతరం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక అంతరాలు రుగ్మతలపై  ప్రజల సహకారంతో ఉమ్మడిగా పోరాటం చేసి ఉంటే రాజ్యాంగ పరిధిలో తమ  అధికారాలను వినియోగించితే ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులతో పాటు ఈ దేశ ముఖచిత్రం మరొక రకంగా ఉండేది.

     ఇది రాజకీయపక్షాలకు ప్రభుత్వాలకు తెలియని విషయం ఏమీ కాదు. కానీ నిరంతరం అధికారం శాశ్వతం చేసుకోవాలనే తలంపు తో ఉండే రాజకీయ పక్షాలు ప్రజలను ఏనాడు కూడా ప్రభువులుగా చూడని కారణంగా ప్రజలు కూడా బానిస మనస్తత్వానికి అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి సామాజిక స్థితిగతుల మధ్య ఇవ్వాల అనేక సామాజిక రుగ్మతలు విలయ తాండవం చేస్తున్నాయి.

   సామాజిక రుగ్మతలు-- అకృత్యాలు-- అత్యాచారాలు:

  తోటి    మనిషిని సాటి మనిషిగా చూడవలసిన టువంటి ఈ సమాజంలో మనిషిని మనిషి దోచుకునే కృత్రిమ వాతావరణం ఎల్లెడలా వ్యాపించి పోయినది. పాలకులు తమ సంబరాల్లో మునిగి తేలుతుంటే సమాజంలోని ఉన్నత వర్గాలు, బలవంతులు, శక్తివంతులు ఇదే అదనుగా భావించి అట్టడుగు పేద గిరిజన ఆదివాసీ దళిత బలహీన వర్గాల పై ఇష్టారాజ్యంగా  జులుం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో జాట్లు  అక్కడి అట్టడుగు దళిత ప్రజల మీద అకృత్యాలకు పాల్పడడం తోపాటు మహిళలపై అత్యాచారాలకు ఒడి కట్టడం దశాబ్దాల తరబడి  చూస్తూనే ఉన్నాం.

     అలాగే కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చుండూరు, కారంచేడు ప్రాంతాలలో అగ్రవర్ణాలు దళితులపై ఊచకోతకు పాల్పడి తీరని ద్రోహం తలపెడితే ఆ సంఘటనలు ఇవాళ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయినాయి. ఇటీవల నల్లగొండ జిల్లా అడ్డగూడూర్ ప్రాంతంలోని పోలీస్స్టేషన్లో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ కు గురయ్యింది. ఇటీవల ఆదిలాబాద్, వరంగల్ ,అసిఫాబాద్, ఖమ్మం లాంటి జిల్లాలలో పేద గిరిజన దళి.త సంచార జాతులకు చెందిన అనేకమంది అకృత్యాలకు బలైతే వారిని పరామర్శించిన దాఖలాలే లేవు..

      దేశవ్యాప్తంగా ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోనూ జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనలు ఉదాహరణలు మాత్రమే. ఈ సంఘటనల వెనుక గల కారణాలు ఆ సామాజిక వర్గాల యొక్క ఆర్థిక సామాజిక స్థితి గతులు ప్రభుత్వాలకు స్థానిక అధికారులకు శాసనసభ్యులకు తెలియనివి కావు.

    ప్రజా వ్యతిరేక చర్యలు-- అకృత్యాలకు గల కారణాలు:

       ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన చర్యల కంటే వ్యతిరేకమైన చర్యలకు ఎక్కువగా పాల్పడినట్లు విశ్లేషకులు తమ పరిశోధనలో తేల్చి చెప్పారు. మద్యం ఏరులై పారుతు౦టే, మత్తుపానీయాలు, గంజాయి,  క్లబ్బులో అశ్లీల శృంగార అకృత్యాలు టీవీ ప్రసారాలలో రెచ్చగొట్టే చర్యలు ఇవన్నీ ఊహించని సంఘటనలు జరగడానికి కారణం కాదా?

    అకారణంగా నేరాలను ఆరోపించి బలవంతంగా వారితోనే అంగీకరింప చేసి జైలుపాలు చేసి బంగారం ఆస్తులు వంటి దొంగతనాల కేసులో నిర్బంధంగా ఒప్పించి వారి నుండి బలవంతంగా  వసూలు చేయడం నిత్యజీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో నేర విభాగంలో చూస్తున్న విషయాలే కదా!. చేయని నేరానికి ఏళ్ళతరబడి పాశవిక మైనటువంటి నిర్బంధాలు, చర్యలకు, లాటి, తూటాలకు బలి అవుతూ ఉంటే మనుషులు మృగాలుగా మారకుంటే ఏమవుతారు?

      ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన గత ఏడు సంవత్సరాల నుండి యువతను నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వమే ప్రధాన భూమిక వహించింది అని చెప్పక తప్పదు. అది మద్యం మిగతా అశ్లీల శృంగార కార్యక్రమాలను చట్టబద్ధం చేయడం వల్లనే ..

    ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం;

       గతంలో అత్యాచార సంఘటన జరిగిన అనంతరం జరిగిన చర్చ సందర్భంగా అనేక సూచనలు ప్రభుత్వ దృష్టికి వచ్చినవి. దేశవ్యాప్తంగా జరిగిన సంఘటన సందర్భంలోనూ ఇటీవలే హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలో జరిగిన చిన్నారి అత్యాచారం సందర్భంగా జరిగిన చర్చాగోష్టిలో అనేక మంది సామాజిక కార్యకర్తలు  డాక్టర్ వీరేందర్ లాంటి సైకాలజిస్టులు అనేక మంది విశ్లేషకులు కూడా సంఘటన జరిగిన తర్వాత చర్చించడం కంటే సంఘటనలు జరగడానికి గల పూర్వాపరాలను సామాజిక రాజకీయ పరిస్థితులను ప్రభుత్వాలు విస్మరి౦చకూడదని  బాధ్యతలను  ఆలోచించాలని చెప్పడం జరిగింది.

      ఇవాళ పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలతో పాటు కుటుంబాల లోపల కూడా పెంపకంలో జరుగుతున్నటువంటి కొన్ని లోపాలు నాగరికత ముసుగులో పల అశ్లీల శృంగారపరమైన టువంటి విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం స్వేచ్ఛ పేరుతో స్త్రీ పురుషులు లేదా యువతీ యువకులు అపరిపక్వ దశలో నే తొందరపాటుతో అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరికి వివాహం చేసుకోనని  సందర్భం వచ్చినప్పుడు లేదా వివాహం చేసుకొమ్మని బలవంతం చేసినప్పుడు యాసిడ్ దాడులు, హత్యలు, నిరంతర మానభంగాలు వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

      పోలీసుల యొక్క ఉదాసీనత, చట్టంలోని లొసుగులు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, వివిధ వర్గాలతో చర్చలు  జరిపి తగు పరిష్కారాలను చేసే విషయంలో ప్రభుత్వాలు దృష్టి  కేంద్రీకరించ కపోవడం, విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న టువంటి చాటు మాటు ప్రేమ వ్యవహారాలు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్న కొన్ని సందర్భాలు.
     దేవాలయాలు, జాతర కంటే ఇవ్వాళ విద్యాసంస్థల దగ్గరే పోలీసుల యొక్క  పాత్ర ఎంతో అవసరమని ప్రేమ పేరుతో దాడులు లేదా భయకంపితులను చేసే సంఘటనలు నివారించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని అనేకమంది విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా సూచన చేస్తున్నారు.

      ప్రభుత్వాలకు సంబంధించిన వారి బంధువులు లేదా రాజకీయ పార్టీలకు చెందినటువంటి మిత్రులు సన్నిహితులు క్లబ్బులు శృంగార కార్యక్రమాలతో రాత్రి పగలు రహస్యంగా యువతను నిర్వీర్యం  చేస్తూ రెచ్చగొడుతున్నాయి. మరొకవైపు మద్యం మత్తులో కూడా యువత పెడదారి పట్టి అకృత్యాలకు బలవంతంగా పాల్పడుతూ అందుబాటులో ఉన్న వారి పైన పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు కూడా విడిచిపెట్టకుండా జరుగుతున్న ఈ అత్యాచారాలకు ప్రభుత్వం ఏనాడూ బాధ్యత తీసుకోలేదు. పోలీసులు కూడా సంఘటన జరిగిన తర్వాత మాత్రమే ప్రయత్నించడం తప్ప జరగక ముందు జాగ్రత్తలు చేపట్టే విషయంలో ఉదాసీనంగా నే ఉన్నార ని చెప్పక తప్పదు.

     సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఐదు సంవత్సరాల పసిపాపపై జరిగిన అత్యాచారం తర్వాత ఎందరో నాయకులు, ప్రజా సంఘాలు ,మహిళా సంఘాలు, విప్లవకారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే కానీ పోలీసులు దోషుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించలేదని పెద్ద విమర్శ కొనసాగుతున్నది. తర్వాత పోలీసుల బారి నుండి తప్పించుకోలేక ఆత్మహత్యకు పాల్పడి రైలు పట్టాలపై శవమై తేలినాడని ఒక వైపు ప్రకటిస్తుంటే మరొకవైపు ఆత్మహత్య కాదని తమ  కళ్లముందే జరిగిన హత్య అని కొందరు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నట్లు యూట్యూబ్ ఛానల్ల లో ప్రసారాలు తెలియజేస్తున్నవి.

     పరిణామాలు;

     ఒక  ఇంట చిన్న పాప  అత్యాచారం,హత్య తో కుటుంభం శోకసముద్రంలో మనిగితే  మరో కుటుంబ యజమాని నేరస్తుడై ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబాన్ని కూడా శోక సముద్రంలో ముంచి వెళ్ళాడు. ఇది జరిగిన వాస్తవం. ఇలాంటి సంఘటనల సందర్భంగా పరిశీలన విశ్లేషణ దృష్టితో మానవ సంబంధాలను మానవతావాదాన్ని పెంపొందించే విధంగా పైశాచికత్వాన్ని  నిర్మూలించే విధంగా సమాజంలోని భిన్న వర్గాలతో పాటు పోలీసుల, ప్రభుత్వాల, సామాజిక కార్యకర్తల చర్యలు ఉండాలని పలువురు కోరుతున్నారు.

      ప్రజలను కంటికి రెప్పలా కాపాడే స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు వారి సామాజిక బాధ్యతను విస్మరించకుండా ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి తప్పిదాలను వెంటనే కట్టడి చేసి సామాజిక స్థితిగతులకు సంబంధించినటువంటి కార్యాచరణను సామాజికవేత్తల సూచనల మేరకు పరిష్కరించడం ద్వారా మాత్రమే ఒక ఉన్నత సమాజాన్ని ఆవిష్కరించగలము. మనిషిని  సాటి మనిషిగా చూస్తేనే మానవతా విలువలను పెంపొందించ గలుగుతాము. అప్పుడు ఇలాంటి అకృత్యాలకు ఆస్కారం ఉండకుండా ఉంటుంది .ఇది సంస్థాగతమైన, వ్యవస్థీకృతమైన, సామాజిక ఆర్థిక రాజకీయ పరమైన దృక్కోణంతో పరిశీలించినప్పుడు మాత్రమేసాధ్యమవుతుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

0/Post a Comment/Comments