మూడు దార్లు కలిసే కూడలి.ఒక దారి నున్నటి సిమెంట్ రోడ్డు.... వేరొకటి ముళ్ళ తోను, రాళ్లతోకూడిన ఇ సుక బాట....ఆ రెండింటికీ మద్య , వానలకు. వరదలకు కొట్టుకుని పోయి ఎగుడుదిగుడుగ ఉన్న గతుకులరోడ్డు. ఆ మూడు దార్ల కూడలిలో ,గతుకుల రోడ్డు పై నిలబడి,అందమైన సిమెంట్ రోడ్డును,ముళ్ళబాటను మార్చి మార్చి చూస్తున్నది ఒక కన్య.ఆమె వెనుకగా బక్క చిక్కి నట్లుగా నడి వయసు మనుషులు ఆమెను ఎలాగైనా ఆ సిమెంట్ రోడ్డు పై
పయ నింపచేయలని ,అష్టకష్టాలు పడి సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుం టూ సిమెంట్ రోడ్డు ఎక్క టాని కి ఆ డబ్బు సరిపోదని తెలుసు కుని ,ఇక డబ్బు సంపాదించే మార్గం తెలియక తమ కోరిక ను చంపుకోలేక నిస్సహాయు లై ఆశ గా సిమెంట్ రోడ్డు వైపు చూస్తున్నారు.ఆ కన్య సిమెంట్ రోడ్డు ను,రోడ్డు పైనవిలాస పురుషులను , బక్క చిక్కిన తన వారిని చూస్తూ సిమెంట్ రోడ్డు వైపు వారిని అసహ్యంగా చూసి విసురుగా తల తిప్పుకుని ఇసుకబాట ను నిశి తంగా పరిశీలిస్తూ, ఒక ని ర్ణ యానికి వచ్చినట్లు గా తల పంకించి ,పక్కనే వున్న నడివయసు మనిషి తో ఏదో చెపుతుంది.ఆమె నిశ్చయా న్నీ మార్చుకోమని అతడు నచ్చచెపుతున్నాడు.ఆమె తల అడ్డం గా తిప్పుతూ ఆశీర్వచనం కోసం అతని పాదాల వద్ద వ్రాలి నమస్కరించి,ముళ్ళతో నిండిన ఇ సుక బాట వైపుగా పయనిస్తూ ,వెనక్కి తిరగకుండా ,తన లక్ష్యాన్ని చేరు కునేందుకు తదేక దీక్షతో ముందుకు సాగి పోయింది...
* * * * * * * * *
తుళ్ళి పడి లేచింది స్వప్న.చుట్టూ పరికించి చూస్తూ తను కల కన్నట్లు గా తెలుసు కుంది.కల లో నైనా తన సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది... ఎంత చక్కటి కల!...కట్నం ఇవ్వటం ఆచారమని ....ఆ ఆచారం. తో నిర్మింపబడిన సంప్రదాయపు సిమెంట్ రోడ్డు.....దానిపై నడిచే హక్కు కట్నాల మార్కెట్ లో అధిక ధర తో మగాడ్ని కొనుక్కోగల స్థోమత వున్నవారికి మాత్రమే!..
రెండవది ముళ్ళ తో నిండిన ఇసుక బాట. ఈ దారంటు ఉన్నట్లు చాలా మందికి తెలిసినా...ఆ దారి వైపు కన్నెత్తి కూడా చూడరు... సరికదా... ఆ బాట వైపు పయనించిన వారిని వెలి వేస్తారు. మూర్ఖత్వపు ముళ్ళ తోను, కులమతాల కుళ్లు తోను రాళ్ళ తోను కప్పబడిన ఆ దారి అందమైన సిమెంట్ రోడ్డు లా మార్పు చెందాలంటే ఆ ముళ్ళను కుళ్ళును రాళ్ళను తుదముట్టించే, నవసమాజాన్నీ కోరే నవ నిర్మాతలు, అభ్యుదయ వాదులు, ఆ బాట వైపు పయనించి, ఆ దారి ము ళ్ళదారి అనే అపోహను తొలగించి ... ప్రజలంతా ఆ బాట వైపు పయనించే టట్లు గా అభ్యుదయానికి తోడ్పడాలి. వరకట్న దురాచారం, కులమత కుటి లత్వం.. లేని ఆ రోడ్డు "నవ సమాజ నాంది మార్గం" అంటే బాగుంటుంది. ఈ బాట వైపు పయనించే వారికి ఓర్పు, సహనం, త్యాగశీలతలు సుగుణాలు గ కలిగి వుండాలి. అవే వారి భవిష్యత్తు కు శ్రీరామ రక్ష.
మూడవది మధ్యతరగతి బ్రతుకులకు ప్రతీక గా నిలిచిన గతుకుల రోడ్డు.. కట్నాల వరదలో బ్రతుకులు కొట్టుకు పోతున్నా ఆచారం అంటూ ఇంకా ఆ , వ్యసనాన్ని, పట్టుకు వ్రేలాడు తారే కాని ధైర్యం గా తమ పిల్లల్ని నవసమాజపు బాట వైపు వెళ్ళ నీయరు. సంఘానికి భయపడి కొంత, ఆ బాట లో తాము ఊహిస్తున్న భయంకర భవిష్యత్తు కి భయపడి కొంత వారు ఆ బాట వైపు చూడటానికి సాహసించరు. ఇది తన కల కి అర్థం. ఏ మైనా తాను ఈ ఆచారాల సంకె ళ్ల లో ఇరుక్కోదు.
కష్టమైనా, నిష్టూర మైనా కల లోని కన్య నిర్ణయమే తనకు మార్గదర్శకం అందుకు తన తల్లి దండ్రులు ఒప్పుకున్నా లేకపోయినా అదే తుది నిర్ణయం. మధ్య తరగతి కుటంబాలలో సంప్రదాయం పేరిట, తర తరాలుగా వస్తున్న ఈ కట్నాల దురాచారం రూపు మాపాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెళ్లి చేయటం కోసమే పెంచకుండా, వీలైతే ఒంటరి గా నైనా జీవించ..గల ..ధైర్యాన్ని వారిలో పెంపొందించాలి.ప్రతి ఆడపిల్ల నైతిక పత నానికి దిగజారక ,కులమత వ్యవస్థ ను లెక్కచేయకుండా, కట్నానికి అమ్ముడు పోని యువకుడి కోసం ఎదురు చూడాలి. ఒకొకప్పుడు ఆ నిరీక్షణ లో నిరాశ మిగిలినా అధైర్య పడ రాదు. అలా ఎందరో కన్య జీవితాల త్యాగ ఫలితంగా నైనా ఈ దురాచారాన్ని రూపుమాపాలి. అందుకే తను కట్నం తో వరుడు ని కొనుక్కోకుండ.... ఏదో ఉ ద్యోగాన్ని సంపాదించుకుని కల లోని కన్య లానే ఎవరు నడవని ముళ్ళబాట లోనే పయని ప్రయని స్తా ను. అదృష్ట వశాత్తూ, నా ఆశయాలకు సరిపడే యువకుడు నా దారి లో కలిస్తే, అతడు ఏ కులమైనా మతమైనా, అతని తోనే చివరి వరకు. పయనిస్తాను.లేక పోయినా నిరాశ పడను. ఎలాంటి మానసిక బలహీనతలకు లోనవ్వక ఒంటరిగా నే జీ విస్తా." ముదురుతున్న ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ,తన ఆశయాన్ని ఆచరణ లో పెట్టటం కోసం, తను తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసి వారి ఆశీర్వాదం పొందటం కోసం హుషారు గా మంచం దిగి ముందుకు. సాగి పోయింది. 'స్వప్న.'