"కవిశేఖరుడు - గురజాడ" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"కవిశేఖరుడు - గురజాడ" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

కవిశేఖరుడు - గురజాడ

ఆధునిక తెలుగు సాహిత్యంలో
మహాకవి గురజాడ
సాంఘిక దురాచారాలపై
కలం ఎత్తి కరుణాజనకమైన 
రచనలు చేసిన సాహితీకారుడు
దేశమంటే మట్టి కాదు
దేశమంటే మనుషులు అని
చాటిన మేధా సంపన్నుడు
స్త్రీలకు విద్య అవసరమని
గుర్తించిన సంఘ సంస్కర్త
ఆధునిక కథలకు ఆద్యుడుగా
అభ్యుదయ భావాలు కలిగిన
సమాజ సేవకుడు
సమ సమాజం కోసం
పరితపించిన మానవతావాది
వ్యావహారిక భాషోద్యమంలో
భాగం పంచుకున్న
ఉద్యమకారుడు
కన్యాశుల్కమనే నాటకరచనతో
కలకాలం పాఠకుల హృదయాలలో
నిలిచిన మహాకవి గురజాడ 
మనందరికీ అడుగుజాడ 

ఆచార్య ఎం.రామనాథం నాయుడు,
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments