పిచ్చుకమ్మ -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పిచ్చుకమ్మ -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

" పిచ్చుకమ్మ "
---------------------------
అందాల పచ్చిక
వాలింది పిచ్చుక
ప్రేమతో చేయుము
చెలిమితో మచ్చిక

అరుదైన పిచ్చుక
చేస్తుంది వేడుక
ముద్దుగా నింగిని
విహరించు పిచ్చుక

చిన్నారి పిచ్చుక
పొన్నారి పిచ్చుక
సొగసుగ గూడుకట్టి
నివసించు పిచ్చుక

"రేడియేషన్" తో
రాలిపోతున్నాయి
సంరక్షణ పూనుము
అంతరిస్తున్నాయి

-గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments