తెలంగాణ వైభవము - కాళోజి

తెలంగాణ వైభవము - కాళోజి

*🌷🌻తెలంగాణ వైభవము - కాళోజి🌻🌷*
  *🌼మణిపూసలు🌼*

తెలుగు వెలుగు *కాళోజి*
జన గొంతుక *కాళోజి*
జీవితాన్ని మనకిచ్చిన
ప్రజల మనిషి *కాళోజి* !!

సిరాచుక్క *కాళోజి*
నిప్పు కణిక *కాళోజి*
తెలుగునాట ఉద్యమాన్ని
నడిపె చూడు *కాళోజి* !!

చలన శీలి *కాళోజి*
మహనీయుడు *కాళోజి*
పద్మ విభూషణుడై
వెలుగువెలిగె *కాళోజి* !!

వైతాళికుడు *కాళోజి*
హక్కులడిగే *కాళోజి*
నిజాము నెదిరించినట్టి
కవి శిఖరమే *కాళోజి* !!

యోధుడే మన *కాళోజి*
ధీరుడే మన *కాళోజి*
నాగొడవన సృష్టించిన
చైతన్యమే *కాళోజి* !!

తెలుగు యాస *కాళోజి*
తెలుగు భాష *కాళోజి*
తెలంగాణ వైభవాన్ని
కోరుకొనెను *కాళోజి* !!

జయము నీకు *కాళోజి*
నినుమరవము *కాళోజి*
నిండు మనము తోడ మీకు
కైమొడ్పులు *కాళోజి* !!

*......✍️మణికర్ణిక🌹☘️*
వడ్ల. నర్సింహా చారి,
భాషోపాధ్యాయులు,
జెడ్పిహెచ్ యస్.శేరిలింగంపల్లి 

0/Post a Comment/Comments