"వినాయకచవితి" (పద్యాలు) రచన:- రఘుపాత్రుని.సాయిశివ

"వినాయకచవితి" (పద్యాలు) రచన:- రఘుపాత్రుని.సాయిశివ

శార్దూలముII
శ్రీ విఘ్నేశ్వర నీవ్రతంబు తొలుతన్! జేయంగ నుత్సాహమున్!
రావయ్యా! గణనాధ నీశ్వరసుతా! లంబోదరా!దేవరా!
మావేల్పై నినుపూజసేతు నెపుడున్! మారేడుగా!!, బ్రోవగన్
దీవింపన్! గిరిజాసుతుండ జగతిన్!! దేవా నమోవాకముల్!
-----------------------------------------------------------------------
సీసముII
ఆదిపూజకు జగతిన్ యధికారి నీవయా!
-----వేల్పుల సేవితా! విఘ్నరాజ
పార్వతీ ప్రియసుతా! పాలించితివిదేవా!
-----విఘ్నపీఠమునకున్! విఘ్నరాజ
భారతరచనను వ్రాసితివి రయమున్!
-----విద్యాప్రసాదితా! విఘ్నరాజ
మోదకప్రయుడవో! మూషికవాహన
-----ప్రేమమూర్తివిమాకు విఘ్నరాజ

తేటగీతిII
నిన్ను తలవంగ మోదంబు నిత్యముండు
కార్యములనందు విజయంబు కలుగునయ్య
యిడుములుండవు నేవేళనెపుడునైన
వందనములు నీకివియేను వరదహస్త!!
------------------------------------------------------------------------
 కందముII
వందనమో! విఘ్నేశా!
వందనమో! గిరిజతనయ పావనచరితా!
వందనమో! లంబోదర
కందముతో!నివె ప్రణతులు కావుముదేవా!!
-----------------------------------------------------------------------
రచన:- రఘుపాత్రుని.సాయిశివ
బి.ఏ (స్పెషల్ తెలుగు) ద్వితీయసంవత్సరము
బ్రాహ్మణతర్లా గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా.
చరవాణి:- 9493316130 

0/Post a Comment/Comments