రత్నాల సరాలు--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

రత్నాల సరాలు--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

రత్నాల సరాలు
--------------------------------------

చిన్న పిల్లల నవ్వు ముఖములు
సొగసులొలికే మింటి తారలు
పరిమళించే గుండు మల్లెలు
పండు వెన్నెల నిండు వెలుగులు

పాలు వంటివి వారి మనసులు
తేరిచూస్తే వెన్న ముద్దలు
చెట్టు కొమ్మకు లేత చిగురులు
అమూల్యమైన  శుద్ధ జలములు

తేనెలూరును వారి పలుకులు
మనసు దోచే వాన చినుకులు
ధరణి యందున పసిడి మొలకలు
కడుపు నింపే తీపి ఫలములు

చిన్న పిల్లలు భువిని వేల్పులు
జగతి నేలే సూర్యచంద్రులు
కన్నవారికి వారు ఆస్తులు
ఉన్నఊరికి మంచి మిత్రులు

--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments