బ్రతుకు భారం - వెలుగు దూరం --దొడ్డపనేని శ్రీ విద్య

బ్రతుకు భారం - వెలుగు దూరం --దొడ్డపనేని శ్రీ విద్య


బ్రతుకుభారం - వెలుగు దూరం


గంపను మోస్తూ నువు నడిసొస్తుంటే
సూర్యుడినే మోసుకొస్తున్నావనిపిస్తుంటే

అంతటి భారం నీ తలపై ఉందనిపిస్తే
బ్రతుకు భారం నిన్ను దరి చేరిందనిపిస్తుంటే
బడి ఆనందం నీకు దూర మవుతుందనిపిస్తే

నీ బాల్యం ఎంతగా చితికిపోయిందనిపిస్తుంటే
ఆదరణ కరువైన నీకు సూరీడే వెలుగౌవుతుంటే

భావి తరాలకు దారి చూపిస్తుంటే
వెట్టి చాకిరీతో బ్రతుకు వెతలవుతుంటే
నిలువ నీడ లేని నీ వాళ్ళకోసం 
మోస్తున్నావంటే

ఆకలి ఆరాటం బరువు మోయిస్తుంటే
చదువు సంధ్యలు ఏదీ నీకు పట్టనట్టుంటే
నీకు తెలుస్తోందా! ఓబాలుడా!

నువు మోస్తున్న బరువు ఎంతో
నీ కోసమా, నీ వాళ్ళ కోసమో 
నువు బలౌవుతుంటే
నా కళ్ళు చెమర్చెనే పసివాడా!  
నా జోహార్లు నీకు


--దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ

0/Post a Comment/Comments