*క* వన సేద్యమందు
కవితలల్లుచుందురు
మధుర భావనలేరి
దండలల్లుతుందురు
మార్గమేదైనను
మంచి గంధాలు పంచేరు
*వి* ద్వత్తు నంతయును
దృశ్యాన పొదిగించి
జ్ఞాన గీతుల పంచి
తెలివిడిని వెలిగించి
తమకు తామే సాటిగా
తారలై మెరిసెదరు
*మి* తం తోడగా మాట
మింటినాలోచన
కంటి చూపులలోన
నిజ భావ మెలిగించిన
వాగ్దేవి సుతులైన
వాల్మీకి వారసులు
*త్రు* ంచి వేయును చెడు
తనువు పులకించంగ
రోగ జనిత మైన
ఆకు లొదిలే లాగ
కృషి వలుల వారసులు
చైతన్య శీలులు
*ల* క్ష మాటలు పేర్చి
లాలిత్యమును పంచి
మదిలోని బాధలను
భావ గంధాలు పంచి
తేనెను కూర్చేటి
తేటి వారసులు
*కు* మతులను చూసి
పద గుంపులతొ దాడి
సుమతులను చూసి
మృదు భావాల పాడి
జగతి నిర్థేశకులైన
నవ సమాజ నిర్మతలు
*వి* కసించు పూవులకు
వేయి భావాలు పంచు
విలపించు మొక్కలకు
పద జలలోదార్పు నెంచు
జయమగును నెంతయో
కావ్య జననీ జనకులకు
*నా* యక మణులల్లె
నడయాడి భావాన
లోక ప్రాకారానల్లు
తీవెలెన్నొ నాటిన
కళా సైరికులై వెలుగు
మానవ మూర్తులు
*య* ంత్రంబుతో మట్టిలో
పసిడి పండించినట్టి
విఘ్ననాయకుడివి
నిజ గీతి పంచినట్టి
మీ కవనమే జగతిని
జయములై వెలిగించె
*క* లమునే హలముగ
నడిపించి కవనాన
వెలుగు పూలనెన్నొ
పూయించి జగతిన
మేలు కోరే చరితుడా
మేలు బంతి ఒజ్జా!!
*చ* దువుల సారాన్ని
చరణాలుగా పంచి
గణమైన నీతులను
దీప్తులుగ వెలిగించి
కవితలల్లిన రేడా
కవన వన విహారి
*వి* జయాలు కూర్చేటి
విఘ్ననాయకు డల్లే
తామస మతుల మదిన
వెలిగించ మిణుగురల్లె
ఔనౌను నీ కలమే
బ్రహ్మ రాతల మార్చు
*తి* మిరంతొ సమరాలు
చేయించు పదాలల్లి
ఈతి బాధలు తీర్చ
మధుర నీతులు జల్లి
వారేవ్వా కవిరాజా!!
అణువణువు తేజుడా
*శు* భములెన్నో ఇచ్చి
శృతి చేయు మనమున
విజ్ఞాలు తొలగించి
వెలిగించి బ్రతుకున
గణపతి వారసుడా
ఘణ చరిత కవివర్యా!
*భా* ద్రపద మందున
చవితి దినములోన
జనియించు నాయకా
జగద్ధారకవనిన
కోటి వెలుగులు పంచు
ధీర గంభీర గణ నాధా!
*కాం* క్షియున్నవి యన్ని
తీపి యగు నట్లుగా
నీ కమల నయనాలు
శాంతి పవనాలుగా
వెలిగించ మని జగతి
వేడుతున్నామయ్యా
*క్ష* ణం యే రీతినో
మా బ్రతుకు తీరుండు
అట్టి భ్రాంతిలోనే
భ్రమసి నిను మరిచిండు
నవరాత్రులు సింహాసనాలేసి
ప్రకృతిని ప్రకృతిలో కలుపు వైభవాలు
*లు* డుగులా బసవని
భూకైలాసమున
తారక సురుడంటి
మూర్ఖత్వమొదిలించిన
వీర ధీర చరితుడా
కవి కుల నాథుడా !!
రమేశ్ గోస్కుల
కైతికాల రూపకర్త.