నిత్య సత్యాలు
దేవునికి మించిన రక్షణ లేదు
వ్యక్తిత్వం కి మించిన సద్గుణం లేదు
సాధన కి మించిన కృషి లేదు
త్యాగం కి మించిన మానవత్వం లేదు
ప్రతిభకు మించిన గుర్తింపు లేదు
స్నేహానికి మించిన తోడు లేదు
నమ్మకాని కి మించిన సంపద లేదు
అదృష్టానికి మించిన ఆనందం లేదు.
తీపికి మించిన అనారోగ్యం లేదు.
త్పప్తి కి మించిన ఔషదం లేదు
నిజానికి మించిన నిప్పులేదు
విమర్శకు మించిన ఉత్తేజం లేదు
ప్రశంస కు మించిన ప్రొత్సాహం లేదు
వాగ్వాదం కు మించిన దూరం లేదు
అహానికి మించిన ఆవేశం లేదు
మౌనానికి మించిన మాట లేదు
బాధకు మించిన బరువు లేదు
అమ్మకు మించిన అమృతం లేదు.
దైర్యం కు మించిన రాణింపు లేదు
విజయానికి మించిన హద్దు లేదు
ప్రేమ కు మించిన వాస్తవం లేదు
చులకనకి మించిన దూషణ లేదు
ఆనందానికి మించిన అందం లేదు
-- దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ