మానవత్వం -వల్లంభట్ల వనజ

మానవత్వం -వల్లంభట్ల వనజ

మణి పూసలు --
మానవత్వం

ఆకలియన్న వారికి
అన్నము పెట్టవేటికి
పెట్టుకున్న గంజైనా
పంచి తాగుమందరికి!

రెక్కాడితె డొక్కాడని
బడుగు జీవి బాధల్గని
బరువెక్కిన గుండెలతో
బాధలన్ని తీర్చబూని!

కంకణాబద్దుండవై
వెలుగుపంచు భానుడవై 
జీవితాలు మార్చివేయు
పేదవారి పెన్నిధివై!

కళ్ళముందు జరుగుతున్న
అన్యాయము నాపుమన్న
జరుగుతున్న ఘోరమాప
రుద్రుడవై కదులుమన్న!

ఆలయమ్ములోననీవు
ఆది దేవుని వెతికేవు
మెట్లమీద నున్నతనని
కాంచలేక పోయినావు!

మానవత్వ పరిమళాలు
వ్యాపించేను దశదిశలు
మది,మదిని తట్టిలేపి
విరజిమ్మును లోవెల్గులు!

అహము విడిచిపెట్టుము
ఆనందము పంచుము
సాటివారి పట్లనెపుడు
ప్రేమభావ ముంచుము!

కళ్ళముందే మగువ
కాలి పోతెగానవ
చేత నైన రీతిలో
చేయుత నీయలేవ!

చిట్టి చిట్టి పాపలు
మన కంటిదీపాలు
కాపాడిన కౌశలమున
వారు కాంతిరేఖలు!

పూరిగుడిసె బతుకాయె
వాననీట మునకాయె
సంతృప్తను సంపదతో
ప్రతిరోజు పండగాయె!

సాటిమనిషి బాధచూసి
మన బాధగాతలపోసి
ఆదరించి చేరదీయు
మానవత్వము కలబోసి!

నేనన్నది మరవాలి
మనమంటూ కదలాలి
స్వార్థాన్ని విడనాడుతు
సమైక్యంగ సాగాలి!

              ✍🏻వల్లంభట్ల వనజ
                      అదిలాబాద్

0/Post a Comment/Comments