కొత్త గాలి కరోనా గోల. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ . జిల్లా. తెలంగాణ రాష్ట్రం.

కొత్త గాలి కరోనా గోల. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ . జిల్లా. తెలంగాణ రాష్ట్రం.

కొత్తగాలి కరోనా గోల (కవిత)
---------------------------------------
ఇది ఏమికాలమని తానువచ్చే
మనమదిలోని కలతలను గిచ్చే
మరి ఎవరి కాలమని తాను మెచ్చే
ఆ యముని కాలమని తీర్పునిచ్చే !

మాయదారీ ఈ మహమ్మారీ
మాయరోగంగా తాను మారి
మాటువేసి కాటు వేయురా
మసిపూసి మాయ చేయురా !

ఏమి రోగమొచ్చే ఇలామరి
ఏమి రోగమొచ్చే కలా సరి
ఆమాయదారి మహమ్మారి
మన ఇంటదూరి చేసెసవారి !

ఎటునుంచి వచ్చెనురా
ఏమి కొని తెచ్చాను రా
మాయదారి కరోనదయ్యం
కలిగించగా మదిలోన భయ్యం !

మహమ్మారి కరోనా
అసలు దాని పేరంట
చైనాదేశమందున్నటి
యుహన్ దానిఊరంట !

దాని కాయమంత విషమంట అంటుకుంటే కలుగును తంట
పూట పూటకు ఎక్కువగునంట
చీటి మాటికి చిక్కులే కల్గునంట !

సిసలుగా అందరం ఉండాలి ఇంట
అసలు కడప దాటి రావొద్దు నంట
శానిటైజర్ చేసుకొంటెనే  ముద్దంట
అప్పుడు తప్పునులే మనకు తంట

కోవిడ్ దువ్వుతుంది దాని కోరమీసం
దాడి చేసి చూపాలి నీవు సాహసం
తోకముడిచి పారిపోవు ఆ  కరోనా
తెలుసుకుని నడుచుకో ఇక సరేనా!

కొరివి పెడుతున్నది ఈకోవిడ్
తిరిగి పెట్టవోయి ఓ బారీకెడ్
తొలగిపోవు అప్పుడు ముప్పు
అవునో కాదో నిజం నీవు చెప్పు !

ఈ కరోనా పయనం ఎటు ?
కన్గొని లక్ష్మణ రేఖను దాటు
దాడి చేసి వెయ్యవోయ్ వేటు
వెయ్యకుండా ఉంటే నీకే చేటు !

టీకా తీసుకుని ఉంటే
నీకే ఇక మంచిదంట
తీసుకోక నీవిక ఉంటే
కాటికే ఇక నీ దారంట !

తెలుసుకొని నడుచుకోరా సోదరా
తెలియకుండా నీవుంటేనే బాధరా నీ బరువు బాధ్యతలను తెలుసుకో
కావలసిన జాగ్రత్తలను ఇక తీసుకో!

హామీ పత్రం
----------------
ఈ కవిత నా స్వంత రచన. ప్రత్యేకంగా ఈ పోటీ కోసం వ్రాయబడినది........ గుర్రాల.

గుర్రాల లక్ష్మారెడ్డి., కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments