ఉపాధ్యాయుడు --- పేరు అద్దంకి లక్ష్మి. ఊరు ముంబై

ఉపాధ్యాయుడు --- పేరు అద్దంకి లక్ష్మి. ఊరు ముంబై

తేదీ 5_9_21

ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా

  అన్ని దానములలోకి విద్యాదానం మిన్న అని ఆర్య సూక్తి.
  అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతి వెలిగించే వారు గురువు.
  నల్లబల్లపై వ్రాసిన ప్రతి అక్షరము విద్యార్థుల మహిష్కం పై శాశ్వతంగా ముద్రించే  గురు బ్రహ్మ.
  మట్టి బొమ్మలను తెచ్చి మాణిక్యాలు గా రూపు  దిద్దే అక్షర శిల్పి.
   విద్యార్థులకు మంచి చెడులను విశదీకరిస్తూ, మానవతా విలువలను పెంచుతూ, బ్రతుకు పోరాటానికి మార్గాన్ని చూపే మార్గదర్శకుడు.
   వారి లోటుపాట్లను సరిదిద్దు తూ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే కళాకారుడు.
   విద్యార్థులను ఉన్నత శిఖరాగ్రం చేర్చేందుకు రేయింబవళ్ళూ కృషి సల్పే కష్టజీవులు,,
   పాఠాల లోనే గుణపాఠాలు  బోధిస్తూ విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మలుస్తారు ,
   విద్యార్థులకు కర్తవ్యాన్ని బోధిస్తూ గమ్యస్థానాన్ని చేరుస్తారు.
   అందరికీ సర్వ సమాన భావంతో విద్యా దానం చేసే మహోన్నత వ్యక్తి.
   ఒక స్నేహితుడిగా హితవు బోధిస్తూ,,
   ఒక తండ్రిగా ప్రేమను పంచుతూ,
   ఒక తరువుగా నీడనిస్తూ
   ధర్మ మార్గాన్ని నడిపిస్తూ
   విజ్ఞానాన్ని పంచుతూ
   విద్యార్థుల భవిష్యత్తే తన జీవిత ధ్యేయంగా
   ఒక శ్రేయోభిలాషిగా వెలుగొందే నిస్వార్థ పరుడు   గురువు ..
   సమాజానికి ఆదర్శవంతులు అయిన యువతను రూపొందించే
   బహుముఖ ప్రజ్ఞాశాలి.
   దేశభక్తి పరాయణుడు
   ఇలలో గురువే దైవము.
   గురుశిష్యుల బంధం విడదీయరాని ఒక పవిత్ర బంధం.
   ఉత్తమ అధ్యాపకుడిగా, రాష్ట్రపతిగా భారతరత్న గా ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ని స్మరించుకుంటూ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాము.
   గురువులందరికీ పాదాభివందనాలు.
    


  --పేరు అద్దంకి లక్ష్మీ
     ఊరు ముంబై
     సెల్ నెంబరు
      9 7 5 7 0 4 3 4 6 9


0/Post a Comment/Comments