అక్షర కవిత
"(మ) మధురం"
మనసే అందాల బృందావనం
మధురమైన విరుల వనం
మమతల దేవాలయం
మది గదుల జ్ఞాపక నిలయం
మద మాత్సర్యాలులేని గుణం
మనమే భరతజాతి పౌరులం
మనుగడకు ఆదర్శ మూర్తులం
మరువలేని త్యాగధనులం
మరపురాని కధనశూరులం
మంచికి మహానుభావులం
మహాత్ముని వారసులం
మనసే మాకు ధనం
మనసున్న కుబేరులం
మన దేశం మానవతకు చిహ్నం
మన ఓర్పు నేర్పు ఆదర్శం
మన దేశ ఔన్నత్యాన్ని నిలుపు తాం..
పేరు :శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి:9490239581
Post a Comment