జ్ఞాన దీపిక పుస్తకం ---పొన్నూరి భారతలక్ష్మి, ముంబై, మహారాష్ట్ర.

జ్ఞాన దీపిక పుస్తకం ---పొన్నూరి భారతలక్ష్మి, ముంబై, మహారాష్ట్ర.

జ్ఞాన దీపిక పుస్తకం
---పొన్నూరి భారతలక్ష్మి,
    ముంబై, మహారాష్ట్ర.

అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి
జీవితానికి వెలుగు నిచ్చేది
సంతోషాన్ని కలిగించేది
మనసుకు శాంతి నిచ్చేది పుస్తకమొక్కటే

మంచీ చెడూ తెలియచేస్తూ
సక్రమ మార్గంలో నడిపించేదీ
అక్షరాలను అందాల సుమాలుగా కూర్చి
అందించేదే పుస్తకం

ఎన్నో పురాణాలూ వేదాలను
మనకు అందించి
భారత భాగవత పద్యాలను ఆస్వాదింప చేసిందీ ఆపుస్తకమే

పుస్తకం లేనిదే చదువులు లేవు
మనిషికి లేదు ఎదుగుదల
మానవుని ఉన్న స్థితి నుండి
ఉన్నత స్థితి కి తీసుకు వెళ్ళగలిగేది పుస్తకము

మన ఆశలకు భావాలకు రూపాన్నిచ్చి
సంఘంలో వక స్థానాన్ని  కల్పించేది 
సరస్వతీ దేవి  రూపంలోనున్న పుస్తకమే
పుస్తకమే హస్త భూషణమై
 ప్రసాదించాలి జ్ఞానాన్ని  సర్వమానవాళికీ


0/Post a Comment/Comments