ఎండ మావులు - మార్గం కృష్ణ మూర్తి

ఎండ మావులు - మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

ఎండమావులు

ఎటు పోతుందీ దేశం?
ఎటుపోతున్నాయి రాష్ట్రాలు?
ఎక్కడుంది ప్రజాస్వామ్యం?
ఎక్కడుంది స్వేచ్ఛా స్వాతంత్ర్యం?

ఝాన్సీ లక్ష్మి భాయి , అల్లూరి , టంగుటూరి
తిలక్ , పటేల్ ,భగత్ ,నేతాజీ,మహాత్ముడు
లాంటి మరెందరో స్వాతంత్ర్య సమరయోధుల
త్యాగ ఫలం, ఈ నాటి మన స్వాతంత్ర్యం!

ప్రజల త్యాగాలు తక్కువేమి కాదు
ఎన్నో ఆశలు , ఎన్నో ఆశయాలు
బానిసత్వపు బ్రతుకులు పోతాయనీ
స్వేచ్ఛగాజీవించగలమనీ,మాట్లాడగలమనీ!

కానీ ఆశలన్నీ ఆడి ఆశలయ్యాయి
కోరికలు మంచులా కరిగి పోతున్నాయి
వీటికి తోడు ప్రపంచీకరణ జరిగి పోయే
నేతలలో స్వార్ధం పెరిగి పోయే
చట్టాలు నేతల, ధనికుల చుట్టాలాయే!

వ్యవస్థలలోని లొసుగులు తెలిసిపోయే
అధికారం సాధిస్తేనే అవినీతి సాధ్యమని
ఓట్ల కోసం కోట్లయినా ఖర్చు పెట్ట సాగిరి
వేల కోట్ల సంపదను కూడబెడుతుండిరి!

అధికారం కొరకు అడ్డదారులు తొక్కుతూ
ఓటు బ్యాంకుకొరకు ఉచితబంధుపధకాలు
అందిస్తూ , రిజర్వేషన్లనూ పొడిగిస్తూ
తలఎత్తకుండా , ప్రశ్నించే శక్తి లేకుండా
ప్రజలను బిక్షగాళ్ళను చేస్తుండిరి,
జనాలను సోమరులనుచేస్తుండిరి!

స్వేచ్ఛగా బ్రతకడము , భావ వ్యక్తీకరణము
ఆత్మాభి మానంతో  జీవించడము
కనీస సౌకర్యాలతో నివసించడమనేకోరికలు
ఎండ మావులయి పోతున్నాయి!

నేడు తొంబైశాతం సంపద,
కేవలంపదిశాతం కుబేరుల చేతులలో
కేవలం  పది శాతం సంపద
తొంబైశాతం పేద మధ్యతరగతి ప్రజలచేతిలో

ప్రజా స్వామ్యానికి అర్ధమే మారి పోయే
సామ్యవాద సిద్ధాంతం మరిచి పోయిరి
పెట్టుబడి విధానం విస్తరించి  పోయే
ప్రయివేటీకరణకు పావులు కదుపు తుండిరి!

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్



0/Post a Comment/Comments