విజ్ఞానపు కాంతిపుంజం గురువు --మోటూరి నారాయణ రావు

విజ్ఞానపు కాంతిపుంజం గురువు --మోటూరి నారాయణ రావు



విజ్ఞానపు కాంతిపుంజం గురువు 
-- మోటూరి నారాయణ రావు, 
జర్నలిస్టు, హైదరాబాద్, 9346250304.


ఓంకార అక్షరంతో.. 
ఓనమాలు నేర్పించు
బీజాక్షర  త్యాగ ప్రధాత
మట్టిలోని మాణిక్యాలకు
పురుడుపోసే హితకారుడు

అజ్జాన తిమిరాలు దాటించు
విజ్జాన జ్యోతులు  వెలుగించు 
అక్షర పరిజ్ఞానం నందించు 
మహా మౌనముని  గురువు 

శిలను శిల్పంగా మలచి
శోభగులద్దును శిల్పి 
మొద్దుచెక్కను సైతం 
సొగసుగా చెక్కును వండ్రంగి 

వికారాకృతుల  అకారమై 
అక్షరాల ఆయువునందించగ
అరుదెంచిన దైవమే గురువు 
విశ్వనరుడు, గుణాత్మమార్గదర్శి

జీవితాలను వెలిగించే జ్జానదీప్తి
శిష్యునిపై పుత్రవాత్సల్య దృష్టి 
శాస్ర్తీయధృక్ఫధ చైతన్యస్ఫూర్తి 
మహోన్నత వ్యక్తిత్వ మూర్తి  

కుల, మత, వర్ణ, వర్గ వివక్ష 
అంతరాలెరుగని విద్యాఘని 
నైతికవిలువలు నేర్పించు 
జాతిని జాగృతిచేసే సద్గురువు
సూక్ష్మబుద్ధినిచ్చెడి ప్రభోదకుడు
విజ్ఞాన కాంతిపుజ్యం  గురువు




0/Post a Comment/Comments