రుధిరశిల్పం --వి. కృష్ణవేణి

రుధిరశిల్పం --వి. కృష్ణవేణి






రుధిరశిల్పం

ఓ మానవ నీవు దేవుడు చెక్కిన శిల్పనివే కాదు..
నీకు నీవు మలుచుకుని జ్ఞానమనే రంగులు అద్దుకున్న జ్ఞానబుద్ధుడివి కూడా..!

హద్దులు దాటి మైమరచిన..
కాలానికి బలి అయినా..
 నీ వ్యక్తిత్వమే కాదు
రూపం కూడా మారువేషమేగా...

నీ సామర్థ్యమునకు తగ్గట్టు నీవే మలుచుకో జీవితాన్ని,
శిల్పిచెక్కిన అపురూప శిల్పంలా ...

ఎదుటివారిని చూసి గ్రహిస్తే అది మంచి అవ్వాలిగాని స్వార్థబుద్ధిగల రూపం ధరించిన ప్రతిమ కారాదు..

అజ్ఞానందకారమనే చీకటిలో జీవితమనే ప్రతిమను మలుచుకున్నావో...
జ్ఞానోదయమనే వెలుతురులో నీ ప్రతిమకు నీకే  సమాధానం అంతుచిక్కదని తెలుసుకో..
 
బ్రహ్మకు సైతం అబ్బురుపరిచే జీవితాన్నిచవి చూడగలవు ఈ సృష్టిలో..

విధినింధించిన, కాలం కాటేసిన..
మనుగడకు  అనర్థపరిస్థితి ఎదురరైనా
గుండెనిబ్బరతను చొప్పించు...

అననుకూల, సానుకూల పరిస్థితులలో..
ఒడుదుడుకుల పరిస్థితులలో కూడా నిలబడే
సహజత్వాన్ని ప్రాణంగా పోసి జీవితాన్ని రూపుదిద్దుకో...

ఓర్పు,సహనమనే మానవీయ విలువలను కల్గి..
సహకారం, బాధ్యత అనే మానవ లక్షణాలను చొపించి రుధిర శిల్పాన్ని నిర్మించుకో...
అదే జీవితానికి పరమార్థం.


వి. కృష్ణవేణి
వాడపాలెం
9030226222

ప్రక్రియ :వచనం 


 
 

0/Post a Comment/Comments