మనసు మాట వినదు - నీ ఆలోచన లో నేను ఎవరిని ---మీను

మనసు మాట వినదు - నీ ఆలోచన లో నేను ఎవరిని ---మీను
నీ ఆలోచన లో నేనెవ్వరిని!!!!!
దిక్కులు అన్నీ నన్ను కొత్తగా చూస్తున్నట్లు గా దిగులుగా ఉంది.......

మనస్సులో భావాలు మాటై పలకడానికి  మౌనం 
సహనం పాటించు అంటునట్లుంది.....

గుండెల్లో ని బరువు దించే ధైర్యం అమాయకత్వం మై జాలిగా చూస్తోంది.....

నాలోని ప్రతి ఆలోచన నీతో పంచుకున్న ప్రదేశాల లో నన్ను వెతుకుతున్నాయి.....

నా అంతరంగం అనేక ఆలోచనన ల  తో అవరించి నన్ను అసహ్యం గా చూస్తున్నట్లుంది.....

మరి నేను ఎవరిని!!!!!

నీ ఆలోచనలో నేను ఎవరిని!!!!!

మనస్సులో దాచుకున్న  ప్రేమనా
అంతం లేని అభిమానం చూపే భాద్యత నా
అర్థం చేసుకున్న స్నేహాన్నా
అనునిత్యం తోడుండే అల్లుకున్న బంధువు నా
నీ ఆలోచనలో నేను ఎవరిని........!!!!!

---మీను 🖊️

0/Post a Comment/Comments