రైతు (ఆట వెలదులు) --వడ్ల నర్సింహా చారి

రైతు (ఆట వెలదులు) --వడ్ల నర్సింహా చారి

🌼🌷రైతు🌷🌼
   ఆట వెలదులు
*****************
   వి.యన్.చారి

బలమునందునెపుడు బలరాముడునుమేటి
ద్వాపరమున చూడ ధరణిలోన
హలము చేత బూని హాలికుండైవెల్గి
రైతు బంధుడయ్యి రాజ్యమేలె!!

అన్నదాతగాను నవనిలో వెలుగొంది
బ్రతుకు పంచినట్టి ప్రాణసముడు
యితడు లేక యున్న యిబ్బందు లొచ్చును
తిండి గింజ లేక తిప్ప లయ్యి!!

పొలము నందు యితడు పొద్దుగుంకువరకు
పొలముపనులచేయు పోటి పడుతు
మనము తినెడివన్ని మనరైతుచలవనే
దానకర్ణుడితడు ధరణి లోన!!

గ్రామమందుయుండి కర్షక రూపుడై
సేవచేయు నిత్య సేవ కుండు
పంట పొలములన్ని పచ్చగా మార్చిన
నిత్య పూజ్యు డితడు నిజము నమ్ము!!

పుడమి తల్లి కితడు పూజలు చేయుచు
పంట తీయునట్టి పావనుండు
నీవు లేక యున్న నిలువము మేమంత
అంజ లింతు మీకు నాత్మ యందు!!

*......✍️మణికర్ణిక🌹☘️* 

0/Post a Comment/Comments