'నగుమోములు భాగ్యము' -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.

'నగుమోములు భాగ్యము' -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.

'నగుమోములు భాగ్యము'
-------------------------------

నగుమోములు అందము
బ్రతుకులోన భాగ్యము
తెచ్చును ఆరోగ్యము
ఇచ్చును ఆనందము

పెనువేయును బంధము
వెన్నెలమ్మ చందము
పరిమళించు గంధము
పెంచును అనుబంధము

నగవులేని ముఖములు
మసిబారిన గృహములు
తావిలేని సుమములు
నీరులేని చెరువులు

నవ్వు మోము శుభములు
ఉట్టిపడును వెలుగులు
బ్రతుకంతా జయములు
కలుగజేయు సుఖములు

--గద్వాల సోమన్న,
        ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments