పార్వతి తనయ(కైతికాలు) -అక్కి నర్సింలుగౌడ్

పార్వతి తనయ(కైతికాలు) -అక్కి నర్సింలుగౌడ్

కరిముఖ వదన గణనాథ
కావగ రావ వినాయక
కోమల హృదయ గణేశ
కోర్కెలు దీర్చు వినాయక
వవ్వా పరమేశ పార్వతీ‌ తనయ
పరమ దయాకర ప్రార్థింతునయా

గౌరీతనయ గణనాథ
శంకరపుత్రా గణేశ
చేరి మొక్కితి వినాయక
కరుణించ వయా గణేశ
వవ్వా ఓ బొజ్జ గణపతి
నీవే‌కదా మాకింక గతి

సుర సేవిత కరుణాకర
సుందర ‌వదనా రావయ
కమనీయ రూపు నీదెగ
కావగ రావ దయామయ
వవ్వా గుజ్జు రూపక రావయా
విజ్ఞాలు తొలగించి ‌పోవయా

సిద్ది బుద్ది పతివినీవు
సిద్దిని కలుగగ జేయుము
మంచి బుద్ది నొసంగుమయ
జ్జానము ప్రసాదింపుము
వవ్వా కైలాస నిలయా దేవా
కరుణతో బ్రోవుము గణనాథా

చదువుల‌ నిచ్చెడి వాడవు
చల్లని మనసున్న దేవ
దీవెనల నొసగగ‌ నీవు
మెల్ల‌మెల్లగ ఇటు రావ
వవ్వా ఉండ్రాళ్ళ‌ ప్రియా
కుడుముల నారగించవయా.

అక్కి నర్సింలుగౌడ్
9912659965

0/Post a Comment/Comments