దోమకాటు-తప్పదుచేటు(కైతికాలు) --తాళ్ల సత్యనారాయణ

దోమకాటు-తప్పదుచేటు(కైతికాలు) --తాళ్ల సత్యనారాయణ

ఆహ్లాదకరమైన
వర్షాకాలములోన
ప్రమాదంపొంచివుంది
దోమలవృద్దివలన
పరిశుభ్రత పాటిద్దాం
దోమలను అరికడుదాం

మనిషి రక్తాన్ని నేరుగ
పీల్చేసే దోమలు
ప్రవేశపెడుతాయి
పలు సూక్ష్మక్రిములు
ప్రమాదకర దోమలు
తప్పవు పలువ్యాధులు

అనాఫిలస్ దొమకాటు
ప్లాస్మోడియం సోకి
మలేరియను కలిగించు
శరీరంలో పాకి
విషపూరిత దోమలు
తప్పవు పలువ్యాధులు

క్యులేక్స్ దోమకాటు
విషద్రవాలుచేర్చి
ఇబ్బందిపెడుతుంది
బోధకాలుగా మార్చి
కుట్టకుండ చూసుకోండి
వ్యాధిబారిన పడకండి

ఏడిస్ దొమకాటుతో
చికెన్గున్యా సంభవించు
తీవ్రమైన నొప్పులతొ
నెలలతరబడి బాధించు
దోమకాటుకు గురవ్వద్దు
జాగ్రత్తలు మరవద్దు

దోమలద్వారావచ్చే
వ్యాధులను తేలికగ
తీసుకుంటే మారునవి
ప్రమాదకర వ్యాధులుగ
జాగ్రత్తగా మసలుకోండి
నిర్లక్ష్యం చేయకండి

ఇంటిచుట్టుపక్కల
నీరునిల్వ చేరకుండ
శుభ్రపరుచుకోవాలి
నిర్లక్ష్యం చేయకుండ
పరిసరాల శుభ్రతే
ఆరోగ్యానికి భద్రత

మురికి నీటి నిల్వలో
పోయాలి కిరోసిను
దోమలవృద్దవకుండ
వాటికది పాయిజను
దోమకాటుతొ నష్టం
జాగ్రత్తపడుట ముఖ్యం

డెంగ్యూ చికెన్గున్యా
వ్యాధిబారిన పడకుండ
జాగ్రత్తపడాలి దొమ
కాటుకు గురికాకుండ
భిన్నమైన దోమలు
కలుగు పలువ్యాధులు

దోమకాటుతో  వచ్చే
ప్రాణాంతక వ్యాధుల్లొ
డెంగ్యూ వైరస్ కూడ
ప్రమాదమె రోగాల్లొ
దోమకాటు ప్రమాదం
జాగ్రత్తలతో అరికడదాం.

--తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్

0/Post a Comment/Comments