తప్పెవరిది? తల్లిదండ్రులదికాదా?... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

తప్పెవరిది? తల్లిదండ్రులదికాదా?... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

తప్పెవరిది? తల్లిదండ్రులదికాదా?

అమ్మా !
కాస్త జాగ్రత్త సుమా !
దారిలో "ముళ్ళుంటాయి"
కుచ్చుకున్నా పరవాలేదు
కానీ దారిలో కొన్ని విషపు "కళ్ళుంటాయి"
కామంతో నిండి...కాస్త జాగ్రత్త....అమ్మ హెచ్చరిక

ఔను ఎటు పోతోంది నా దేశం
ఏమైపోతుంది నా భారతదేశం
ఇంతగా భ్రష్టు పట్టిపోయింది ఈ సమాజం

ఎన్ని చట్టాలుండి ఏం లాభం?
కామంతో కళ్ళుపొరలు కమ్మిన
ఈ మగజాతికి ఈ మానవ మృగాలకి
సిగ్గూ లజ్జా భయమూ భక్తి లేకుండా పోతోంది

వయసులో ఆకర్షణ ప్రకృతిధర్మం
వయసొచ్చిన యువతీయువకుల్లో
చాటుగా సరసం ముద్దూముచ్చట సహజం

కానీ
మాయామర్మం
ఎరుగనివాళ్ళు
లోకం పోకడ తెలియని వాళ్ళు
నల్లవన్ని నీళ్ళని తెల్లవన్నీ పాలని
అందరూ మావాళ్ళేనని
అందరూ మంచివాళ్ళేనని
మోసానికి వంచనకు దయకు దగకు
అర్థం తెలియని అమాయకపు పిల్లలు
కసాయి మనుషుల నీడన పయనిస్తారు
నట్టేటముంచే నయవంచకుల్ని నమ్ముతారు
బుసలుకొట్టే విషసర్పాల పడగ నీడన పవళిస్తారు

కాస్త మంచిగా మాట్లాడి ప్రేమగా పలకరించి
చిన్న చాక్లెట్ ఇస్తే చాలు ప్రక్కనే కూర్చుంటారు
వాళ్ళు "కళ్ళు పొరలు కమ్మిన కామాంధులని" తెలియక
వారినే నమ్ముతారు వారి వెంటే తిరుగుతారు, వాళ్ళు "కూడుతిని కుండనుకూడా పగలగొట్టే కుక్కలని" తెలియక

ఐతే ముంచుకొచ్చే ప్రమాదాలను పసికట్టి
ముందుగా హెచ్చరించకపోవడం
తల్లిదండ్రుల తప్పుకాదా ?
తామ కడుపున పుట్టిన తమ పిల్లల
వికృతమైన విచిత్రమైన కౄరమైన
దారుణమైన దుర్మార్గమైన దుష్టతలంపులపైన చెడుస్నేహితులపైన నిఘా పెట్టకపోవడం
కన్న తల్లీతండ్రుల నేరం కాదా‌?
చేతులు కాలాక ఆకులు పట్టుకని ఏంలాభం?
ఇల్లంతా దొంగలు దోచుకున్నాక ఇక జాగిలాలొచ్చి లాభమేమి?
పెనుప్రమాదం జరిగాక ప్రాణం పోయాక ఎంత ఏడ్చి ఏమిలాభం?
ముందేవుంటే...కాస్త ముందుజాగ్రత్త... ముప్పై తప్పేదేమో?

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502

 

0/Post a Comment/Comments