గురువులకు వందనం ! పాదాభివందనం !!... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

గురువులకు వందనం ! పాదాభివందనం !!... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

గురువులకు వందనం ! పాదాభివందనం !!

అజ్ఞానపు శిధిలావస్థలో నున్న శిలలను
అందమైన సుందర శిల్పాలుగా చెక్కే
అక్షర శిల్పులే "అమరశిల్పి జక్కన్నలే"...గురువులంటే‌ ! 

సమాజంలో సమస్యల సుడిగుండంలో 
చిక్కుకున్ననాడు సకాలంలో స్పందించే 
అభయహస్తాలనందించే "ఆప్తమిత్రులే"...గురువులంటే !

అజ్ఞానాంధకారంలో బంధీలైననాడు 
ఆపదలో ఆదుకునే "ఆపద్బాంధవులే"...గురువులంటే !

జన్మనిచ్చిన అమ్మ పాలిస్తే నాన్న లాలిస్తే
బ్రహ్మ వ్రాసిన తలరాతల్ని మార్చి అందమైన 
బ్రతుకు పుస్తకాన్ని అందించే  
అపర బ్రహ్మలే..."ఆకాశ దీపాలే"...గురువులంటే !

అక్షరాల తోటల్లో తిప్పే అభివృద్ధి బాటల్లో నడిపే ఆశాజ్యోతులే... "ఆదర్శమూర్తులే"...గురువులంటే !

ఉజ్వల భవిష్యత్తును ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఉత్కృష్టమైన జీవితాన్ని ప్రసాదించే ప్రత్యక్షదైవాలే "కనని అమ్మానాన్నలే"...గురువులంటే !

అట్టి గురుదేవుళ్ళకు గుండెల్లో గుడికట్టి  
కవితా కుసుమాలనర్పించి పూజిద్దాం!
పవిత్రమైన వారి పాదాలకు పాలాభిషేకం చేద్దాం !
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలందజేద్దాం !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments