మస్తకం ఓ జ్ఞానమందిరం
మస్తకంలో దాగిఉంది
జ్ఞానమెంతో...
అది అనుభవాలతో వచ్చిన
జ్ఞానమైనా,
పుస్తక జ్ఞానమైనా...
మస్తకంలో మెండుగానుండు జ్ఞానం
ఆలోచనల ప్రవాహమై..
దారిచూపును భవితకు రూపమై ...
పుస్తకానికి మస్తకం ప్రతిబింబం...
మస్తకానికి జ్ఞానమే జాగృతం...!
జ్ఞానంలేని మస్తకం అనివార్యం...
సాగవు ఏ కార్యకలాపాలు పనివార్యం...
అవాంతరాల జీవనగమనంతో
జరగదు ఏ కార్యం...
మస్తకజ్ఞానంతోనే జీవనపయనం సుగమం...
అనుభవాలా జ్ఞాపకాలకు ఆధారం మస్తకప్రపంచం...
ఆ ప్రపంచానికే దారిచూపును అక్షరజ్ఞానం...
అక్షరఆయుధమే లోకానికి వెలుగు...
ఆ ఆయుధం కూడా మస్తకప్రయోగమే...
వ్యక్తిత్వవికాసానికి
మస్తక జ్ఞానమే ప్రమాణం...
అదిలేనిదే సరికాదు
జీవనప్రయాణం...!
మస్తిస్కమంతా శూన్యమైతే
జీవితమంతా అజ్ఞాన తిమిరమే...!
కాంతినిచ్చు జ్ఞానమే
దారిచూపును వెలుగై...
మస్తిస్కమొక ద్వీపమే
వెలుగును నింపును రూపమై...!
వి. కృష్ణవేణి,
వాడపాలెం,
9030226222.
ప్రక్రియ: వచనం.