కాలమా నీకో నమస్కారం (పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు)

కాలమా నీకో నమస్కారం (పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు)

కాలమా నీకో నమస్కారం

ఓ కాలమా నీకో నమస్కారం
గతించిపోయిన గతానివి నువ్వే
జరుగుతున్న వర్తమానానివి నువ్వే
జరగబోయే భవిషత్ నువ్వే

ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎన్నెన్నో మధుర స్మృతులు
ఎన్నెన్నో వాస్తవాలు ఎన్నెన్నో అపోహాలు
ఎన్నెన్నో చారిత్రకాంశాలు ఎన్నెన్నో చరిత్రలు
ఎన్నెన్నో మది తొలగిన మదిలో నలిగిన గుర్తులు

కాలం మిగిల్చిన విషాదలెన్నో
కాలం మిగిల్చిన విశేషాలెన్నో
కాలం మిగిల్చిన విషయలెన్నో
కాలగర్భంలో కలిసిన కథలెన్నో

సృష్టిలో ప్రత్యేకమైనది కాలం
సృష్టిలో విలువైనది కాలం
సృష్టిలో ప్రతిభావంతమైనది కాలం
సృష్టిలో ప్రభావితమైనది కాలం

కథలైనా కావ్యాలైనా కవితలైనా
పురాణాలైన ఇతిహాసాలైనా
వేదాలైనా ఉపనిషత్తులయినా
గీతయైన మన తలరాతయైన కాలం చేతిలో నడవ వలసిందే

తిరిగి తీసుకురాలేనిది కాలం
మనల్ని నిరీక్షింపజేసేది నెమరువేయించేది కాలం
ఊహలు రేపేది ఆశలు కల్పించేది కాలం
కాలం సర్వజనీనమైనది విశ్వజనీనమైనది

మానవుడైన మాధవుడైన 
భోగియైన యోగియైనా
గతించిన కాలానికి మిగిలినగురుతులే
అందుకే కాలమా నీకో నమస్కారం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
           టీచర్ సాలూరు
           విజయనగరం


0/Post a Comment/Comments