మాట ఒక తూటా..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మాట ఒక తూటా..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మాట ఒక తూటా..!(కవిత)
******✍🏻విన్నర్*****
పనికిమాలిన మాటలు పది
మాటలాడి లాభం లేదు..!
పనికి రాని చెత్త కబుర్ల తో కాలం వృథా తప్పితే మరేం కాదు..!
మాటల్లో మన సభ్యత సంస్కారం వ్యక్త మవ్వాలి..!?
మన వ్యక్తిత్వానికి గీటురాయి..మన సంభాషణ..!
కనుక చాలా జాగ్రత్తగా పద ప్రయోగం చేయాలి..!
ఎందుకంటే మాటనే మనిషిని కలుపుతుంది..,మాటనే మనస్సుని విరుస్తుంది..!?
మాట కత్తి కంటే పదునైంది..!??
మాట మనిషిని చంపుతుంది.. బ్రతికుండగానే..!??
ఏం మాట్లాడాలో తెలియనప్పుడు మౌనం మేలు..!
నోరుంది కదాని ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లదు.
చెల్లని నాణానికి విలువ లేనట్లే..,మాట కూడ పనికి రానిదైతే,దానిని ఎవ్వరూ పట్టించుకోరు..!
ఇంకా ఘాటుగా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది..!
అందుకే మాట ఒక తూటా..!??
జాగ్రత మరి..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments