'ఉన్నట్టా.!?లేనట్టా!? ---సుజాత పి.వి.ఎల్.

'ఉన్నట్టా.!?లేనట్టా!? ---సుజాత పి.వి.ఎల్.


'ఉన్నట్టా.!?లేనట్టా!?
(వచన కవిత)

రుద్రుణ్ణని,
పాపుల పాలిట వీర భద్రుణ్ణని
త్రయో నేత్రంతో క్షుద్రులని
భస్మం చెయ్యగలననీ
చెప్పుకుని తిరిగే హరా ఏమైపోయావు..?!
దుష్ట శిక్షకుణ్ణని,
శిష్ట రక్షకుణ్ణని
అసురులను చంపేందుకు
అవతారాలెత్తుతాననీ
చెప్పుకుని తిరిగే హరీ.. ఏమైపోయావు..?!
మనుషులను రక్షించేందుకు
మూగజీవాలని బలిగా కోరే
అమ్మోరుతల్లీ.. ఏమైపోయావు..?!
ఓ..! జీసస్‌..
ఇంకా ఈ నీచుల
పాపాలు కూడా కడిగేందుకు
శిలువ మోస్తూనే ఉన్నావా...?!
యా..! అల్లాహ్‌..
నీ జహన్నూమ్‌ దూతలు
ఈ బేరహమీ లని
నిర్దాక్ష్యణ్యంగా లాక్కుపోరేం?
కలి నీడలో చేరి
మీరు కూడా అసురులకే
కొమ్ము కాస్తున్నారా..?
పసి మొగ్గల్ని సైతం చిదిమేస్తున్న
పాపాన్ని చూస్తూ ఎలా సహిస్తున్నారు?
మీరసలు నిజంగా ఉన్నారా..!?

(ఇటీవల ఆరేళ్ళ చిన్నారి చైత్రపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ..)

-సుజాత పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.


0/Post a Comment/Comments