నిరాడంబర భూషణం
గుప్పెడు భావాలలో
ఆయువునంతా పోసి
చైతన్య దారులలో
అజరామంగా నిలిచిన
అలుపెరుగని తెగువది.
అక్షర జీవనదియై
దూసుకెళ్ళె వాహికగా
నీడల జాడలకై
నిస్వార్ధై తపించగా
నా గొడవతో గొంతెత్తిన
పలుకుబళ్ళ స్వరమది.
యాస భాసల కొరకు
అక్షర తూటాలనిసిరి
వెలుతురు దారులను జూపి
నిలదీసిన కలంధారి
వారెవ్వా ధైర్యగొంతుక
కదలికలు తెచ్చెను మెదళ్ళలో.
శ్రీలతరమేశ్ గోస్కుల,
హుజురాబాద్.