శీర్షిక:అనురగబంధం -- శ్రీ మతి సత్య మొం డ్రేటి

శీర్షిక:అనురగబంధం -- శ్రీ మతి సత్య మొం డ్రేటి


అనురాగ బంధం

భార్యా భర్తల బంధం
జన్మజన్మల అనుబంధం
అగ్ని సాక్షిగా పరిణమయిన జంట 
అనురాగ బంధం తో ఒకటవుతారు.
కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటారు...
వారి బంధం రోజురోజుకీ బలపడుతూ విడదీయలేని
బంధమవుతుంది...
భార్యా భర్తలు ఒకరి మాటకు ఒకరు విలువ నిస్తూ సుఖాసంసారం గడుపుతారు..
బిడ్డలకు జన్మ నిస్తారు.కోరికలకు కళ్లెం వేసి
సంతాన భవిష్యత్తు కోసం తపిస్తారు.
పిల్లలే జీవితమని వారికోసమే బ్రతుతారు.త్యాగాలు చేస్తారు... తర తమ్య భేదాలు మరచి ఇరువైపుల పెద్దల కు
గౌరవమర్యాదలు ఇస్తారు.వృద్దాప్యం లో ఆదుకుంటారు....
సంసార జీవితంలో ఒడిదుడుకలను తట్టుకుని నిలబడి సంసార జీవితాన్ని స్వర్గం గా మలుచు కున్న భార్యాభర్తలు ఎందరికో ఆదర్శం..కోపాలు తాపాలు.. ఆర్థిక శాపాలు అధిగమించి ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్న
భార్యాభర్తలు దైవస్వరుపులు..
వారి పిల్లలు సమాజ దివ్వెలు..
దేశ సంక్షేమానికి భార్యా భర్తలు
పట్టుగొమ్మలు...భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు
నిర్వచనాలు.......ఆది దంపతులకు అక్షర నీరాజనాలు...

పేరు:శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
ప్రక్రియ:వచనం
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1

0/Post a Comment/Comments