సత్య స్వ(స)రాలు
---------------------------------
భగవంతుని నామము
ధ్యానించు హృదయాలు
ధరణిలోన ధన్యము
వర్ధిల్లు జీవితాలు
సహకరించు కరములు
దివిని పారిజాతాలు
స్పందించు మనసులు
భువిని రవికిరణాలు
ప్రేమలొలుకు పలుకులు
జుంటితేనె ధారలు
వినువారికి శుభములు
తెప్పరిల్లు బ్రతుకులు
మంచి చేయు మనుజులు
మహిలో మహనీయులు
గౌరవింప అర్హులు
ఇలవేల్పుల రూపులు
--గద్వాల సోమన్న