గురువులు అంటే --D. శ్రీనివాసులు

గురువులు అంటే --D. శ్రీనివాసులు


గురువులు అంటేగురువులు అంటే గునపాలు కాదు, 
పిల్లల జీవితాలని మలిచే అక్షర శిల్పులు.
\అడగకుండానే మనకి  
అక్షరాభ్యాసం చేసిన  కల్పతరువులు.
బాలల బంగారు భవిష్యత్ కి బాటలు వేసి,
విజయాన్ని అందిస్తున్న అపర భగీరధులు.
మనకు విద్యా బుద్ధులు నేర్పించి, 
సకల సౌఖ్యాలని ప్రసాదించిన కామధేనువులు.
అజ్ఞానపు దారి లో విజ్ఞాన జ్యోతులని వెలిగించి, 
దిక్సూచిని చూపే నావలు.
అప సవ్య దిశలొ ఉన్న 
మన జీవిత గాలిపటాలకి మూలాధారమైన ధారాలు.
నవ సమాజ నిర్మాణానికి అక్షర బీజాలు విత్తిన బాటసారులు.
మనలక్ష్యాలని,గమ్యాలని మనం చేరేవరకు చేయూతనిచ్చే దైవాగ్నులు 
నాడు మీరు నేర్పిన పాఠాలే నేడు మాకు అవి జీవితానుభవాలు.
ఈ స్వేచ్ఛా జగతి లో ప్రతి విద్యార్ధికి మీరే పునాదులు.
అర్థం కాని మన బాల్య దశ కి 
నిగూడర్థాన్ని వివరించిన నిఘంటువులు.
అక్షర నిలయం లో నిరంతరం నిత్యం 
సమస్యాత్మక ప్రశ్నలకి చిక్కుముడు లని తొలగిస్తూ,
అను నిత్యమూ మన కోసమై పరితపించే మూల్యంకణ సాధకులు.
ఎప్పటికి మాకు మీరే దైవాలు.
మీరే మా బాగోగులు కోరే ఆత్మీయ నేస్తాలు.
మీ బోధనలే మాకు ఆచరణాత్మకాలు.

 D. శ్రీనివాసులు
నల్లసింగయ్య గారి పల్లి
అనంతపురం.
9573360881


0/Post a Comment/Comments