తెలంగాణ భాషా దినోత్సవo సందర్బంగా

తెలంగాణ భాషా దినోత్సవo సందర్బంగా

యెనుగందుల శంకర్
కాళోజి నారాయణ రావు జయంతి నేడు 
(9సెప్టెంబర్ 1914 -13 నవంబర్ 2002)

తెలంగాణ ఆత్మగౌరవ కలం కాళోజీ
రాజకీయ సాంఘీక చైతన్యాల సమాహారం
ఓ ధిక్కార స్వరం, జన చేతన బలం
అన్యాయాన్ని "నా గొడవ"కు సంతృప్తి యని

ఓ నిరంతర చైతన్య శీలి !!
పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిదని
రంగారావు రమాబాయమ్మ పుత్ర కలం
రుక్మిణిబాయి ని మనువాడి మడికొండలో నుండి
న్యాయవాదివై అన్యాయాన్ని ఎదిరించిన నీ సూటిదనం !!

ఓ పద్మ విభూషణా !!
రజాకార్ల ఘాతుకాలను ప్రతిఘటించిన రఘువీరా
"మన కొంపలార్పిన మన స్త్రీ లను చెరిచిన
కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే "యని
సాగి పోవుటే బ్రతుకు ఆగిపోవుట చావన్న ప్రజాకవి!!

ఓ ప్రజావాధి !!
నైజామ్ వ్యతిరేక పోరాటం లో.......
"దొరల దెబ్బలు తినుచు గురువు సాపెను వినుచు
బాంచెనయ్యా యనుచు ప్రణమిల్లు ప్రాణాలు" యని
ఆశా నిరాశ ల వ్యత్యాసం తెలిపిన ప్రజల మనిషి !!

ఓ ఉద్యమకర్తా !!
తెలంగాణ ఉద్యమంలో నీరచనే బల్లెంలై
నీ పుట్టుక, "తెలంగాణ భాషా దినోత్సవం"
నీ నడక హెల్త్ యూనివర్సిటీ
కాలంబు రాగానే కాటేసి తీరాలే యని
కసి తీరా రాసావు కాళన్న !!
నీకు జోహార్, జోహార్.........

. యెనుగందుల శంకర్
M.Sc(Org.chem)
ఆరోగ్య విస్తరణాధికారి
PHC ఇందల్వాయి
నిజామాబాదు
9440747614
స్వస్థలం : ఉప్లూర్
మండలం :కమ్మర్ పల్లి
జిల్లా : నిజామాబాదు


0/Post a Comment/Comments