నెహ్రూ జయంతి నేడు(నవంబర్-24)
-------------------------------------
*అలహాబాద్లో పుట్టెను
అందరివాడు ఆయెను
నెహ్రూ స్నేహం చేసెను
చిన్నారులతో గడిపెను
*ఎదపై గులాబీ పెట్టెను
తలపై టోపీ పెట్టెను
బాలలతో జత కట్టెను
చిరుగుండెల్లో నిలిచెను
*"భారతరత్న "ను పొందెను
మన తొలి ప్రధాని ఆయెను
అభివృద్ధి పనులు చేసెను
ఆకాశమంత ఎదిగెను
*నెహ్రూ పుట్టినరోజు
పిల్లల పండుగ రోజు
అఖిల భారత బాలల
ఆనందోత్సవ రోజు
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు