అంశము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 4- --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

అంశము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 4- --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

తేదీ 28 11 21నర్మదా తీర పుణ్యక్షేత్రము
  దానవుల సంహార ప్రాంతము
ఓంకార  అమలేశ్వర ప్రసిద్ధము
చూడచక్కని తెలుగు సున్నితంబు

మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లా క్షేత్రము
సకల పాపహరణ ధామము
ఓంకార ప్రతిరూపా లింగము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

ద్వి జ్యోతిర్లింగాలతో  విశేషము
ప్రణవ స్వరూపుడైన లింగము
ఆటవికులకు  ఒసగె జ్ఞాన దానము
చూడచక్కని తెలుగు సున్నితంబు

స్వయంభువుగా దొరికిన లింగము
 ఓంకార ద్వీపముగా కనబడే క్షేత్రము
 సృష్టికి మూలము ఓంకారేశ్వరుడు
 చూడ చక్కని తెలుగు సున్నితంబు

మాంధాత వంశస్థుల మాంధారేశ్వరుడు
వింధ్య పర్వతాల వింధ్వేశ్వరుడు
ఓంకార స్వరూప ఓంకారేశ్వరుడు
 చూడ చక్కని తెలుగు సున్నితంబు

 పేరు అద్దంకి లక్ష్మి
  ఊరు ముంబై

0/Post a Comment/Comments