దారి చూపిన మానవత్వం .(చిట్టి కథ). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

దారి చూపిన మానవత్వం .(చిట్టి కథ). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

దారి చూపిన మానవత్వం (చిట్టి కథ)
-----------------₹₹₹₹₹------------------
అగ్రహారం అనూ గ్రామంలో అడివయ్య, ఐలమ్మ అను భార్య భర్తలు నివసిస్తూ ఉండేవారు. వారికి ఓ కుమార్తె, ఓ కుమారుడు  ఉన్నారు. కొడుకు పేరు రాజు. కూతురు పేరు రాణి. వారి కున్న నాలుగు ఎకరాల పొలాన్ని సేద్యం చేసుకుంటూ  పిల్లలను ప్రవేటు పాఠశాలలో చదివిస్తున్నారు.
        చదువు కోసం రాజు, రాణి రోజూ బస్సులో టౌనుకు వెళ్ళి వచ్చేవారు. ఆ ప్రకారంగానే ఒకరోజు హడావిడిగా టౌన్ బస్సు ఎక్కబోయి రాజు కిందపడి కాలు విరగొట్టుకొని వికలాంగుడైనాడు
      చెల్లి రాణి ఆ ప్రమాదాన్ని  తన కనులారా చూసి రక్తసిక్తమైన అన్న కాలుని చూసి తట్టుకోలేక మన స్థిమితం కోల్పోయి పిచ్చిదైయింది. పాపం ఆ భార్యాభర్తలకు అప్పట్నుంచి కష్టాలు ప్రారంభమయినాయి. పిల్లల వైద్య ఖర్చులుకై గోరంట్ల ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చింది. దానితో వారి చదువులకు ఫుల్ స్టాప్ పెట్టవలసివచ్చింది.
రాజు అప్పటికిగాని కోలుకోలేదు. చెల్లి రాణి పరిస్థితి గమనించి నిరంతరం చింతిస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఆఊరిలోనే మన స్థిమితం కోల్పోయిన రోగులకు  వైద్యం అందించే ఉచిత క్యాంపు పడుతుందన్న విషయం తెలుసుకొని చాలా సంతోషిస్తూ పడిన చింతను దూరం చేసుకొని ఆ క్యాంపుకు తన చెల్లి రాణిని తీసుకెళ్ళాడు. డాక్టర్లు రాణిని పరీక్షించి ఉచిత వైద్యం అందించారు. కొన్ని ఉచిత మందులు కూడా ఇచ్చి ఆరు నెలలలో నయమౌతుందని చెప్పారు. ఆ మాటలకు పొంగిపోయిన రాజు తన చెల్లెలు రాణిని తీసుకుని వస్తూ, క్యాంపు కాంపౌండ్ సమీపంలోఉన్న నీటి తొట్టిలో మునిగి కింద మీద అవుతున్న మూడు సంవత్సరాల బాలున్ని చూశాడు. వెంటనే ఆగమేఘాలపై పరిగెత్తి ఆ బాలున్ని కాపాడాడు.
     తక్షణం ఈ విషయం డాక్టర్ విమల కి ఫోన్ ద్వారా తెలిపాడు. రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ విమల హడావిడిగా క్యాంపు కాంపౌండ్ నీటి తొట్టి చోటికి వచ్చి నేలపై పరుండి బెట్టి వైద్యం అందిస్తున్న డాక్టర్లను, తన ముద్దుల కుమారుడైన కిరణ్ ను చూసి ఆశ్చర్య ఆందోళనతో నాయనా కిరణ్ అంటూ కుమారున్ని తన గుండెలకు హత్తుకుంది. అప్పుడుగాని జనానికి, తోటి డాక్టర్లకు ప్రమాదంలో పడిన ఆ బాలుడు డాక్టర్ విమల గారి కుమారుడని తెలియరాలేదు.
       వెంటనే అక్కడి జనం, వైద్య క్యాంపు సిబ్బంది అంతా ఆ రాజును చూసి తెగ మెచ్చుకున్నారు. తన కన్నులారా నీటి తొట్టి ఆపద నుంచి రక్షించబడ్డ తన బిడ్డను చూసుకొని డాక్టర్ విమల తన తొట్రుపాటు నుండి తేరుకుని బిడ్డను కాపాడిన రాజును కూడా తన గుండెలకు హత్తుకున్నది.
           ఆమె చొరవను అర్థం చేసుకున్న రాజు చెల్లి రాణి మతిస్థిమితం గురించి విమలకు వివరించాడు. డాక్టర్ విమల"చూడు రాజు! నీవు నా బిడ్డను కాపాడావు. ప్రత్యుపకారంగా నీ చెల్లి రాణికి ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టి వైద్యం చేయించకుంటే నా వైద్య వృత్తికే అవమానం. నీవేమి దిగులుపడకు. లండన్ నుండి నాకు తెలిసిన ఓ మంచి డాక్టర్ ఓ 10 రోజుల్లో మన టౌన్ కు వస్తున్నాడు. అతనికి చూపిద్దాం అంది.
       డాక్టర్ విమల మాటలకు పొంగిపోయిన రాజు విమల గారికి కృతజ్ఞతలు తెలిపి తన చెల్లి రాణి ని తీసుకొని ఇంటికొచ్చి తల్లిదండ్రులకు జరిగిన సంఘటన విషయం చెప్పగా, వారు ఎంతో ఆనందంతో కుమారుడు రాజును. రాణిని గుండెలకు హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
 సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments