పసలేని పద గేయాలు. (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పసలేని పద గేయాలు. (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పసలేని పద గేయాలు
--------------------------------
 అమ్మా అమ్మా ఓమాయమ్మా
ఏదమ్మా నీవిచ్చిన పుత్తడి బొమ్మా
పట్టుపరుపులో తాపవళిస్తుండె
బెట్టు చేయక ఇక తానొస్తుండె !

అమ్మా అమ్మా ఓమాయమ్మా
ఏదమ్మా నీ వెచ్చని నచ్చిన చెమ్మ
వచ్చిస్తానని చెప్పివెళ్ళావుగదమ్మ
వచ్చేదెప్పుడు ఇచ్చేదెప్పుడమ్మ !

అమ్మా అమ్మా ఓ మాయమ్మ
ఏది నువుగీసిచ్చిన చిత్రం
అందిందా మేం వ్రాసిన పత్రం
నీ జాబకు చూస్తుంది మా నేత్రం!

అమ్మా అమ్మా ఓ మాయమ్మా
ఏది మీ ఆలాపన అమృత గానం
నువ్వు పాడితే నవరత్నాలు రాలు
శ్రోతలందరూ చెప్తారు లే జేజేలు  !

అమ్మా అమ్మా ఓ మాయమ్మ
ఏమమ్మా నీవు పంపిన పజిల్స్
మేం చేసి పంపాముగా రిజల్ట్స్
మళ్లీ ఎందుకు ఈ వింత గజల్స్ !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments