పరమ సత్యాలు........ బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

పరమ సత్యాలు........ బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

పరమ సత్యాలు
-----------------------
పదవీ-పెదవీ
అనుభవాన్ని పెంచుతాయి.
ఏమీ తెలియని వాడు కూడా
అవి అందినాంక అన్నీ తెలిసిన వాడౌతాడు.

రోట్లో తల పెట్టి
రోకలి పోటుకు వేరుస్తారా?
యుధ్ధరంగం మధ్యలో కొచ్చి
పాల్గునుడు బెంబేలెత్తినట్లు

ఉపదేశించిన విషయం గుర్తించుకునే గురువును చూసి శిష్యుడికి సందేహాలు రానే రావు.

నలుపుకున్న దుర్గుణ మొక్కటే
అన్ని వర్ణాలను సవర్ణ చేయడం.
తెలుపుకున్న సద్గుణ మొక్కటే
అన్ని వర్ణాలను వివర్ణం చేయడం.

ఎండకు చుర్రుమనే లక్షణమే లేకపోతే
నీడ విలువకు
నిలువనీడ లేకుండా పోతుంది.

వక్ర రేఖలో చూపినన్ని అందాలు
సరళ రేఖలో చూపగలడా చిత్రకారుడు ?

పరతత్వం సులభతరం కాదు
ఆత్మ తత్వం తెలియడం తొలిమెట్టు.
(పరతత్వం...... పరమాత్మ తత్వం. ఇతరుల లక్షణము
ఆత్మ తత్వం..... తన సంగతి . ఆత్మ యొక్క విషయము)

ధనమైనా---నిధనమైనా
పూర్వజన్మ ఫలాన్ని తెలుపుతుంది.
(నిధనము....... మరణం)

సేకరణ
------------
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments