విజయ శిఖరం .(చిట్టి కథ) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

విజయ శిఖరం .(చిట్టి కథ) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

విజయ శిఖరం (చిట్టి కథ)
------------₹₹₹₹----------------
అది ఒక గ్రామం. ఆ గ్రామంలో  ఒకే ఒక గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్. ఆ గ్రామంలోని బాల బాలికలే గాక చుట్టుపట్ల గ్రామాల పిల్లలకు ఆ స్కూలే దిక్కు. అది అది ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ చదువు సంధ్య లకు కావలసిన కనీస వనరులు గాని వసతులు గాని లేవు. అందువల్ల అ ఆ పాఠశాలలో ని ఉపాధ్యాయులే అన్ని వనరులను ఆ గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసుకుని స్కూలును నడుపుతున్నారు.
      ఒక రోజు ఉదయం ఓ జంట తమ ముద్దుల కుమారుని వెంటబెట్టుకుని వచ్చి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో "సార్! మా అబ్బాయికి మీ పాఠశాలలో అడ్మిషన్ కావాలని అని అడిగారు"
ప్రధానోపాధ్యాయులు పొట్టిగా ఉన్న నా వారి అబ్బాయిని చూచి, సరే మంచిది అంటూ స్టాఫ్ రూము నుండి అంతకు ముందే వచ్చి డ్యూటీ లో చేరిన ఓ కొత్త మాస్టారు ని పిలిచి అడ్మిషన్ తతంగాన్ని పూర్తి చేయమని ఆదేశించారు. ఆ పని పూర్తి చేసిన ఆ కొత్త మాస్టారు గారు ఆ అబ్బాయిని తీసుకెళ్లి క్లాసులో ముందువరుసలో ఉన్న రామనాథ శాస్త్రి అనే విద్యార్థి ప్రక్కన కూర్చోబెట్టి వెళ్ళిపో యాడు. ఆ అబ్బాయి అంత వరకు బ్యాగులో ఉన్న తన టోపీ తీసి తల పైన ధరించాడు. తోడు పిల్లలంతా ఆ ముస్లిం అబ్బాయిని అదోరకంగా చూస్తుండగానేమళ్ళీ ఆ కొత్త మాస్టర్ క్లాసు కి వచ్చాడు. తలపై టోపీ తో ఉన్న అబ్బాయిని నిశితంగా కింది నుంచి పై దాకా పరిశీలించి చూసి వెంటనే ఆ ముస్లిం అబ్బాయిని వెనక బెంచ్ కి పంపించాడు. పాపం ఆ అబ్బాయి ఆ మాస్టారు చేసిన పనికి తనలో తానే బాధపడ్డాడు. ఆ చిన్న మొగ్గ గుండెకు పెద్ద గాయమే అయింది. మరోసారి అదే పాఠశాలలో పనిచేసే మాస్టారు అయ్యన్.గార్ తన ఇంటికి ఓ ఆదివారం ఆ అబ్బాయిని పిలిచాడు. ఆ అబ్బాయికి ఆ మా స్టార్ అంటే ఎంతో మానం అభిమానం. అందుకే పిలిచిందే తడవు ఆనందంగా ఆయన ఇంటికి వెళ్ళాడు. కానీ మాస్టారు గారి భార్య వడ్డించేందుకు నిరాకరించు టచ్ చే ఆ మాస్టారే స్వయంగా వడ్డించ గా భోజనం చేసి ఇ చేతులు కడుక్కునే నిమిత్తం పెరటిలోకి వెళుతుండగా మాస్టారి భార్య వంటగదిని శుభ్రం చేయడం ఆ పసి హృదయం గమనించింది. తాను వెళ్లిన తర్వాత ఇంటిని ఏ స్థాయిలో సుబ్రం చేసుకుంటారో ఉంచుకుని ఆ పసి మనసు ఎంత తల్లడిల్లిందోపాపం.
      ప్రాథమిక స్థాయి చదువులు చదువుకుంటూ ఉన్నత స్థాయి చదువులకు శ్రీకారం చుట్టాడు ఆ అబ్బాయి. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సు చేయాలని భావించాడు. ఆర్థిక పరిస్థితి గమనించి విరమించుకోవాలి అనుకున్నాడు. తన అక్క బంగారు గాజులు అమ్మి ఆదుకున్నందున ఆ కోర్సు పూర్తి చేశాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకు హాజరై ఐ .ఎ .ఎఫ్ సాధించాలని అని కలలుకన్నాడు. కానీ కానీ సెలక్ట్ కాలేక తన కలలు కల్లలుగానే మిగిల్చుకున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి కి జీవితం భారంగా బాధ మయంగా తోచింది. కానీ అంతలోనే నిరాశలు, నిస్పృహలు, బాధలు జీవితంలో భాగాలు. వీటిని తట్టుకొని, దిగమింగుకొని భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తేనే విజయ శిఖరం చేరుకుంటా మన్న తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే కర్తవ్యం స్పురించింది అతడికి. అంతే ఇక ఎప్పుడూ ఆ అబ్బాయి ఇక వెనుదిరిగి చూడలేదు.
         పైన పడ్డ ప్రతి రాయిని ఏరుకొని విజయ సౌధాన్ని నిర్మించే టందుకు ముందుకు సాగాడు. అధమ స్థాయి నుండి పై స్థాయి ని అందుకున్నాడు. మన భారతీయుల ముద్దుబిడ్డ. దేశం గర్వపడేలా అంతరిక్ష భారత భాగస్వామ్య రూపకర్త. గగనతలం గీతాలాపన సృష్టికర్త అయ్యాడు.
       ఇంతకు ఎవరా అబ్బాయి అని అనుకుంటున్నారా! అతడే మన మాజీ రాష్ట్రపతి ఎ.పి.జే. అబ్దుల్ కలాం. మనం కూడా డాక్టర్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ విజయ శిఖరం చేరుకుందాం. మొగ్గలూ, మన నెహ్రూ చాచాజీచే చెంపలు నిమర బడ్డ బుగ్గలూ !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments