కలువ పూలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

కలువ పూలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

కలువ పూలు
-----------------------------------
కొలనులోని కలువలు
కనువిందు చేశాయి
కళకళలాడుతూ
హృదయాలు దోచాయి

గాలి కెరటాలకు
శిరములే ఊపాయి
హృద్యంగా నర్తిస్తూ
అందాలు రువ్వాయి

హంసలమ్మలకు తోడుగా
నీటిలో నిలిశాయి
చంద్రునితో చెలిమి చేసి
పరిమళాలు జల్లాయి

అందమైన కలువలు
అందరికీ ఇష్టం
వట్టిగా కోసేస్తే!!
మనసంతా కష్టం!!
--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments