ప్రజాపాలన

ప్రజాపాలన

ప్రజాపాలన

స్వాతంత్రం ఘోషించిన నేల
త్యాగాల పునాదులపై ఉద్బవించిన పుడమి
ఉద్యమాలు ఊపిరిలు నిలబెట్టిన అవని
తల్లికోసం తల్లడిల్లిన భారతజాతి 
నేడు
ఆశలు -ఆకాంక్షలు అన్నీ ఏలేవారికే
చట్టాలు - న్యాయం అన్నీ అందిపుచ్చుకొనేవారికే
ప్రభుత్వ సంస్దలపై గునపాలు దిగుతున్నా
ప్రవేట్ కు అపర ప్రేమతో దాసోహం అవుతున్నా
మనలాంటి అద్బుత పాలన ఈ విశ్వంలో లేదు 
అనాల్సిందే
ఆకలున్నా ... అనరాదు ఆకలి అని
ఏమి అందకున్నా అందలేదు అనరాదు
మేధావికి మౌనమే రక్ష ఈ నాడు
అలాగని మనది బ్రిటిష్ పాలనకాదు
మంచికైనా - చెడుకైనా
అందిపుచ్చుకోవాల్సింది గాంధీజీ చెప్పిన 
చెడువినకు - చెడు చూడకు-చెడు మాట్లాడకు
అనుసరిస్తే 
మనదే విజయం

రచన
డా|| బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722

0/Post a Comment/Comments