సర్వేజనా సుఖినోభవంతు - దొడ్డపనేని శ్రీ విద్య

సర్వేజనా సుఖినోభవంతు - దొడ్డపనేని శ్రీ విద్య


*మానవ సేవే - మాధవ సేవ*

* సర్వేజనా సుఖినోభవంతు*


ప్రార్థించే పెదవుల కన్న సాయం చేసే చేతులు మిన్న

హృదయాంతరాల్లో నారాయణుని కన్న
పరమాత్మ ఎక్కడని యుగా యుగాలుగా వెతుకుతున్న

కొంత మంది దేవాలయాల్లోనే ప్రతిష్టితిడయ్యారన్న

త్రికరణ శుద్ధిగా దైవకార్యం చేయాలన్న
విశ్వ మానవ ప్రేమావళికి చేసే సేవే మిన్న

సేవ అన్నది ముక్తి మోక్షాల కోసం కాదన్న
సమస్త జీవకోటికి సేవలందించే నిమిత్తమన్న

మానవ సేవే మాధవ సేవ అన్న
అది ఎంతో పూర్వజన్మ సృకృతమన్న

సాటి మనిషికి చేసే సాయంలోనే దైవత్వం ఉందన్న
అసహాయులకి చేసే సేవయే భగవంతుడికి చేరుతుందన్న

సర్వేజనా సుఖినోభవంతు అని నినదించమన్న
అదే నిత్య ఆశయంగా జీవించమన్న

వితరణ బుద్ధితో సాటివారిని ఆదరించమన్న
ఆపదలో ఉన్న నిర్బాగ్యుల సేవే ఓ భాగ్యమన్న

అందులోనే సంతోష బ్రహ్మనందమన్న
రోగ పీడితులను దైవ స్వరూపులుగా కొలుచుమన్న

ప్రేమతో సృష్టి లోని అందరినీ సమానంగా చూతుమన్న
అపుడే నీకు ముక్తి మోక్షమన్న

సేవా స్పూర్తిగా కార్య సన్నద్ధులై మెలగమన్న
నలుగురికి తలలో నాలుకగా సేవలందించమన్న

*సమాజంలో భాగమై అదే మహదాశయంగా బ్రతకమన్న*

****************

పేరు:
*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
9492858442

0/Post a Comment/Comments