ప్రముఖ సినీ నటి, నగరి శాశన సభ్యురాలు శ్రీమతి ఆర్. కె. రోజా చేతుల మీదుగా "డా. పైడి అంకయ్య"కు మాన్ ఆఫ్ మిరాకిల్ అవార్డు

ప్రముఖ సినీ నటి, నగరి శాశన సభ్యురాలు శ్రీమతి ఆర్. కె. రోజా చేతుల మీదుగా "డా. పైడి అంకయ్య"కు మాన్ ఆఫ్ మిరాకిల్ అవార్డు


ప్రతిష్టాత్మకమైన వరల్డ్ మిరాకిల్ రికార్డ్స్ సంస్థ మాన్ ఆఫ్ మిరాకిల్  అవార్డును తిరుపతి నగరానికి చెందిన వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్యకు  ప్రముఖ సినీ నటి, నగరి శాశన సభ్యురాలు శ్రీమతి ఆర్. కె. రోజా  చేతుల మీదుగా అందుకున్న సందర్బంగా   ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు  డా. చిటికెన కిరణ్ కుమార్    హైదరాబాదులో  పైడి అంకయ్య ను  సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చిటికెన మాట్లాడుతూ...

సమాజ సేవ లో వే ఫౌండేషన్ ద్వారా2500 కార్యక్రమాలు  నిర్వహించినందుకు గాను  అవార్డును అంకయ్య కు అందించినట్లు తెలిపారు.నిరంతరం గత11 సంవత్సరాల నుంచి అనేక సేవలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా  కరోనా కాలంలో పేద రోగులకు, సహాయకులకు నిరంతరం అన్నదానం నిర్వహిస్తూ వారి ఆకలి తీర్చిన  విశిష్ట సేవకుడిగా అంకయ్య చేసిన సేవలు ప్రశంసనీయమని అందుకు గుర్తింపుగా అవార్డు లభించిందని భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని మన్ననలను పొందాలని తెలియజేశారు.

0/Post a Comment/Comments