*నీవు లేని చోటేది* శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

*నీవు లేని చోటేది* శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

*నీవు లేని చోటేది*
🌻🌺🌾🌻🍀🌺🌾🌺🌻🌾🍀🌻🌺🌾🍀🌺🌻🌾
( *ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో*...)
**************************
**************************

*నీవు లేని చోటేది నింగీ నేలపై..*

అందని ఆకాశాన అధిపతియైన
తూరుపు తలుపు తోసుకుని వచ్చిన నీ రాకతో...
మేలుకొన్న ఉదయం వెతుకుతోంది
తన నీడల జాడలకై మసక వెలుతురు లోనే..
అవని ఆనవాళ్లకు ఊపిరిలూదలనే
నీ ఆరాటం తలపిస్తోంది
తండ్రి తనయులకై పడే తపనలా...

నులివెచ్చని కిరణాల తాకిడితో
విరబూసిన పువ్వులన్నీ కదలాడుతుండెను కదా
హరివిల్లు వంపులనలుముకుని
బోసినవ్వులు చిందే పసిపాపల్లా...

ప్రకృతి అంతటికి 
చీర సారె నందించిన వర్షుడు
సోదర బంధంలా నిలిచెను
అల్లుకున్న ఈ ఆకుపచ్చటి జగానా పుణ్యపురుషుడిలా...

బాధ్యతల సుడిగుండంలో బంధీయైన నువ్వు..
గుప్పెడు భావాలను రంగరించి
రంగుల లోకంలో విహరింప చేస్తుంటే
సీతాకోక చిలుకలు సైతం పోటీపడుతుండె కదా నీ
జీవిత భాగస్వామ్యాన్ని చూసి...

అనురాగ ఆప్యాయతల కొమ్మలకు
పూసిన తనయులు..
అల్లుకున్న పరిమళాలను వెదజల్లగా
సంపెంగ పారిజాత కుసుమాలన్నీ
చిన్నబోయి కూర్చుండే నందన వనమున...

సృష్టికి మూలమై..
నింగీ నేలనంత తిరుగాడి
పిలుపులకై పరిగిడినట్లు..
పయనమయ్యే చిరుగాలిలా...
నీవులేని చోటేది ఇలలో....

వెన్నెలతో పోటీపడి 
చల్లని చూపులు కురిపిస్తూ..
వెలుగుల కిరీటమందించి
కంటికి రెప్పల్లే..
కనుపాపల్లే నిలిచిన నువ్వు సర్వాంతర్యామివే..

మగువల మనుగడకై చేయూతనిచ్చే
అమృతమంటి మనసులు
మహిళా సాధికారతకు మణిపూసలైన...
కడలి దాటని సముద్రుడిలా...
ప్రశాంతత నిండిన 
వదనాలకు వందనం...

0/Post a Comment/Comments