శంభో శివ శంకర - ఎన్. రాజేష్

శంభో శివ శంకర - ఎన్. రాజేష్

శంభో శివ శంకరా
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
శంభో శివా శంకరా
శంభో హరా శంకరా
శివ శివా శ్రీ నీలకంటేశ్వరా
హర హరా ఓ గంగాధరా!

కాపుడుమయా విశ్వేశ్వరా మమ్ముల రక్షించుమయా అర్ధనారీశ్వరా...!
ఎల్లరులను కరుణించుమయా ఓ పరమేశ్వరా,
పాపుల క్షమియించు ఓ ప్రాణేశ్వరా.!

నీ భక్తుల అనుగ్రహించు రాజేశ్వరా..
సమస్తులకు ముక్తిని ప్రసాదించు ఓ ముక్తేశ్వరా!

నీ నీడ లేకున్నా మా బ్రతుకే ఎడారి..
నీవు కాపాడ రాకున్నా కంటకమే మా దారి!

కనుల నీరము జారి పొరలు గోదారి..
కలతలను కడ తేర్చరా హాపురారి!

నీవు తోడుంటేనే మా ఇంట సిరులు..
వెల్లి విరియును ఆనందఝరులు.!

కనికరించిన విరియు ఘన కల్పతరులు..!
అభయమిచ్చిన యెదలో పూల మంజరులు..!!

ఎన్.రాజేష్ (కవి,జర్నలిస్ట్)
హైదరాబాద్-9849335757.

0/Post a Comment/Comments