పిల్లలం-మల్లెలం-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పిల్లలం-మల్లెలం-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

పిల్లలం-మల్లెలం
------------------------------------
అందాల బాలలం
మందార మాలలం
కుందనపు బొమ్మలం
మందహాస జల్లులం

పువ్వు వంటి పిల్లలం
నవ్వు లాంటి మల్లెలం
దివ్వెలొసగు వెలుగులం
అవ్వకు మేమిష్టులం

ముద్దులొలుకు బాలలం
బుద్ధిలోన ఘటికులం
వృద్ధికి మేం బాటలం
పెద్దలకు మిత్రులం

చిన్నారి బాలలం
సన్నజాజి మొగ్గలం
వెన్నెలమ్మ బుగ్గలం
కన్నవారి ఆస్తులం
---గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments