"జాబిలమ్మ" -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

"జాబిలమ్మ" -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

" జాబిలమ్మ "
--------------------------------------
అందాల జాబిలమ్మ
ఆకసాన వెలసింది
వెన్నెల కురిపిస్తూ
అందరికి నచ్చింది

కొలనులోని నీటిలో
ప్రతిబింబం చూసుకుంది
కలువల కన్నెలతో
కరచాలనం చేసింది

పున్నమి వేళల్లో
నిండుగా ఉంటుంది
పండు వెన్నెలతోడ
పండుగే చేస్తుంది

నెలవంక రూపంలో
దర్శనమే ఇస్తుంది
గగనమ్మ సిగలోన
మాలగా మారుతుంది

జాబిలమ్మ జగతిలో
అందరికీ నేస్తం
రాత్రుల్లో వస్తుంది
చల్లదనము ఇస్తుంది

--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments