రైతు ఉద్యమం
గెలిచిన సుదీర్ఘ పోరాటం
పాలంలో కలుపు మొక్కలు ఏరటం
సమాజం లోని అవినీతిని ఏకి పారేయటం
ఉద్యమ బాట పట్టిన రైతున్న
నీ గోడు వినే వారు ఎవరన్న
తమ ఆశయాలను నెరవేర్చు ఆరాటం
ప్రభుత్వాలు న్యాయం చేయాలన్న సంకల్పం
రైతు పండించే దాన్యం తిని బ్రతుకుతాం
వారిని కాపాడి మనం బుణం తీర్చుకుందాం
చట్టాలు రద్దు చేయాలని ఉద్యమ బాట పట్టారు
వ్యవసాయ రంగంలో మార్పు కోరారు
రైతన్నలు సుధీర్ఘ పోరాటం సాగించారు.
ఆందోళన శక్తివంతమైనదని చాటారు
అన్ని సంఘాలను ఏకం చేసారు.
చివరి రక్తం బొట్టు వరకు పోరాడారు.
కరువు రక్కసి తో నిత్యం పోరాడే రైతన్న
ప్రకృతి విలయాలకు తల్లడిల్లినా బెదరలేదన్న
ఆకలి కేకలతో పొట్ట చేత పట్టావు
ఉద్యమ బాటలో ప్రాణాలు వదిలారు
దేశ ప్రగతికే నువు తోడు నీడయ్యావు
ఉద్యమ స్పూర్తితో అందరినీ నీ తోడు తెచ్చుకున్నావు
సుదీర్ఘ పోరాటం లో గెలుపు నీదే అని చాటావు
కరువు రక్కసి తో యుద్ధమే చేస్తావు
దేశ ప్రగతికే తోడు నీడయ్యావు
జోహార్ రైతున్న
జోహార్ జోహార్
🌲🌲🌲🌲🌲🌲🌲
*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
26/11/2021
శుక్రవారం